Warangal: రైల్వే ట్రాక్‌పై వీడియో షూట్‌.. అంతలోనే!

Warangal: డిఫరెంట్‌గా టిక్‌టాక్, రీల్స్, వీడియోలు చేస్తే లైకులు, కామెంట్ల వస్తాయనే ప్రయత్నాల్లో కొందరు యువత ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సాధారణంగా ఇళ్లలో, పార్కుల్లో మైదానాల్లో చేసుకుంటే అంతగా రెస్పాన్స్‌ రావడంతో లేదని కొత్తదనం కోరుకునే క్రమంలో మృత్యువాతపడి వారి వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు. టిక్‌టాక్‌ వచ్చిన మొదట్లో ఓ సరస్సు గట్టుపై ఓ యువతి వీడియో చేస్తుండగా అకస్మాతుగా సరస్సులోంచి ముసలి వచ్చి ఆ యువతిని ఆమాంతంగా తీసుకెళ్లిన దృశ్యం అప్పట్లో చాలా వైరల్‌ అయింది.

ఆ ఘటన తర్వాత టిక్‌టాక్‌ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించినా కొందరు పట్టించుకోలేదు. ఇటీవల కొందరు కొండచరియాల్లో, చెరువులు, పెద్ద పెద్ద భవంతిల వద్ద రీల్స్‌ చేసే క్రమంలో ప్రాణాలను కోల్పోయారు. ఇదే తరహా ఘటన వరంగ్‌లో ప్రాంతంలో చోటు చేసుకుంది.వరంగల్‌ ప్రాంతం వడ్డేపల్లికి చెందిన ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ కోసం ఓ వీడియో చేసేందుకు రైల్వే ట్రాక్‌ను సెలెక్ట్‌ చేసుకున్నాడు.తన స్నేహితుడితో కలిసి ఖాజీపేట్‌ ట్రాక్‌ దగ్గరి వెళ్లారు. వేగంగా దూసుకొస్తున్న రైలు పక్కన నుంచి నడుస్తున్నట్లు చిత్రీకరించాలనుకున్నాడు.

కాసేపటికి రైలు రానే వచ్చింది. రైల వేగంగా వస్తుండగా దాని పక్కనే నుంచి నడుస్తుండా స్నేహితుడి వీడియో షూట్‌ చేస్తున్నాడు. వేగంగా వస్తున్న రైలు వేగానికి యువకుడు ఒక్కసారిగా ఎగిరి పక్కకు పడ్డాడు. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ప్రాణాపాయం కలగకపోవడంతో అక్కడున్న ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు కామెంట్ల రూపంగా యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -