Sudheer: సుడిగాలి సుధీర్ మంచి మనస్సుకు నిదర్శనం ఇదే!

Sudheer: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు భువనేష్. ‘సూపర్ సింగర్ జూనియర్’ షోలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న భువనేష్.. తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తన వాయిస్‌తో చాలా మంది గాయకుల గాత్రాలను బయటికి తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. జటిలమైన శ్లోకాన్ని కూడా ఎంతో అలవోకగా పాడేస్తాడు. ఎవరైనా వాయిద్యాలతో సంగీతాన్ని సృష్టిస్తే.. భువనేష్ తన గాత్రంతోనే సంగీతాన్ని పలకరిస్తాడు. మిమిక్రీలోనూ భువనేష్‌కు ఎవరూ సాటి రారు. అయితే భవనేష్ అందరిలాంటి వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి భువనేష్ కంటిచూపు లేదు. కానీ వైకల్యం శరీరానికి తప్పా.. మనసుకు కాదని ఫ్రూవ్ చేశాడు. సంగీత ప్రపంచంలో చెరగని ముద్రను వేసి.. అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. అయితే తాజాగా భువనేష్ కంటి చూపు చికిత్సపై అతడి తల్లిదండ్రులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ ఫేమ్, హీరో సుడిగాలి సుధీర్.. భువనేష్ కంటి చూపు చికిత్సకు సాయం చేస్తానని చెప్పినట్లు వాళ్లు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

 

విజయనగరం ద్వారకామాయి అంధుల పాఠశాలలో భువనేష్ విద్యాబోధన చేశాడు. పాటలను, పాఠాలను బ్రెయిన్ లిపిలో రాసుకుంటాడు. సంగీతంలో కష్టమైన పదాలు ఉన్నప్పటికీ.. భువనేష్ అవలీలగా వల్లించేస్తుంటాడు. తన తల్లిదండ్రులకు సంగీతం తెలియనప్పటికీ.. సంగీతం మీద ఉన్న మక్కువతో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ మ్యూజిక్ నేర్చుకున్నాడు. అలా విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వచ్చి.. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సంగీత గురువుల నుంచి ప్రశంసలూ అందుకున్నాడు. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన భువనేష్.. తన సంగీత మాధుర్యంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. సెలబ్రిటీలు సైతం భువనేష్ గాత్రానికి ఫిదా అవుతున్నారు. అయితే కంటిచూపు కనిపించదని తెలిసి సుడిగాలి సుధీర్.. భువనేష్ తల్లిదండ్రులకు ఓ మాట ఇచ్చాడట. కంటి చూపునకు అవసరమైన ఆర్థికసాయం తాను చేస్తానని హామీ ఇచ్చాడట. అయితే ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెబుదామని సుధీర్ చెప్పినట్లు భువనేష్ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -