Supreme Court: వివేకా కూతురు విషయంలో సుప్రీం కోర్టు అలా వ్యవహరించడానికి కారణమిదా?

Supreme Court: పాపం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎడతెగని పోరాటం చేస్తుంది ఆయన కూతురు డాక్టర్ సునీత. కానీ ఎందుకో వేసే ప్రతి అడుగులోని ఆమెకి ప్రతిభంధకం ఏర్పడుతుంది. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా న్యాయం కోసం పోరాడుతుంది. అయితే మళ్లీ ఆమెకి సుప్రీంకోర్టు ద్వారా మరొకసారి చుక్క ఎదురయింది.

ఆమె తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో సిబిఐ దర్యాప్తుకు సంబంధించి డైరీ వివరాలు ఇవ్వాలని పిటిషన్ పెట్టుకుంది సునీత. అయితే ఆమె అభ్యర్థులని సుప్రీంకోర్టు నిరాకరించింది పైగా తన అభ్యర్థన పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితులలో కేసు డైరీని పిటీషనర్ కి ఇచ్చే ప్రసక్తి లేదని సునీతకి భారీ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయినా హత్య కేసు దర్యాప్తులో సిబిఐ ఏం కనిపెట్టిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

 

హత్య కేసు పోలీస్ ఫైల్ ఒరిజినల్ రికార్డులని ఫీల్డ్ కవర్లో అందించాలని సుప్రీం ధర్మాసనం సిబిఐని ఆదేశించింది. ఈ కేసులో రిప్లై ఇపిటిషన్ ని రెండు వారాల్లో దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని సిబిఐ విజ్ఞప్తి చేయడంతో సెప్టెంబర్ రెండవ వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అదే సమయంలో గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని ఆయన తరపు న్యాయవాది కోరగా అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు అవినాష్ రెడ్డి బెయిల్ తో పాటు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

అలాగే ఈరోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే సిబిఐ తరఫున ఆఫిడవిట్ ధాఖలు కాకపోవటం గమనార్హం. మరి తండ్రి కేసు విషయంలో కూతురికి న్యాయం జరుగుతుందో లేదో అసలు ఈ కేసు ముందుకు వెళ్తుందో లేదో కూడా తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -