Shani Dev: శనిదేవుని విగ్రహం ఇంట్లో పెట్టుకోకపోవడానికి కారణం ఇదే?

Shani Dev: మనలో చాలామంది శనీశ్వరుడి పేరు వినగానే భయపడుతూ ఉంటారు. శనీశ్వరుని గుడికి వెళ్ళాలి అన్న శని దేవునికీ పూజ చేయాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అయితే శనీశ్వరుని పూజించని వారితో పోల్చుకుంటే పూజించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి శనివారం కూడా కొన్ని వందలాదిమంది శని దేవుని ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. మిగతా అందరి దేవుడి ఫోటోలు విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నప్పుడు మరి శని దేవుని ఫోటోలు విగ్రహాలు ఎందుకు పెట్టి పూజించరు? ఈ సందేహం అనేకమందికి వచ్చి ఉంటుంది.

కానీ చాలామందికి అసలు కారణం తెలియక ఏవేవో అనుకుంటూ ఉంటారు. మరి శని దేవుడు విగ్రహాన్ని ఫోటోను ఇంట్లో పెట్టి పూజించుకోకపోవడం వెనక ఉన్న కారణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడుపవర్ఫుల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే శని దేవుడు మంచి చూపించిన చెడు చూపించిన కూడా రెండు ఒకే రేంజ్ లో చూపిస్తారని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అంటే శని అనుగ్రహం లభిస్తే ఎంత బీదవారైనా కోటీశ్వరులు అవ్వడం కాయం. అలాగే శనికి కోపం వచ్చి శపిస్తే ఎంత కోటీశ్వరులైనా ఏమీ లేని వారిగా కూడా మారిపోతూ ఉంటారు. కానీ శని దేవుడిని మాత్రం ఇంట్లో పెట్టుకుని పూజించము.

 

పురాణాల ప్రకారం శని దేవుడిని ఎవరైనా చూస్తే మంచి జరగదని చెడు స్థితిలోకి వెళ్ళిపోతారని శాపం ఉండడంతో ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోరు. అలాగే శని దేవుడిని పూజించే సమయంలో ఆయనవైపు చూడకూడదు. అలాగే ఎదురుగ ఉండి పూజించకూడదు. శని పాదాలను మాత్రమే పూజించాలి. శనివారం రోజు ఆంజనేయుడితో కలిసి శని దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుంది. అలాగే శని దేవుడికి నూనెను సమర్పించి ఆ నూనె ను పేదలకు దానం ఇస్తే మంచిది. శనివారం పూట చీమలకు నల్ల నువ్వులు, బెల్లం పెడితే మంచిదట. అలాగే ఆయనకు నల్లటి రంగు వాళ్ళ అవమానం జరగడంతో ఆయనకు నలుపు అంటే ఇష్టమట. నల్లని రంగు ఉన్న వస్తువులను శనిదేవుడికి సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -