AP Government: గర్భిణీ స్త్రీలకు జగన్ సర్కార్ అదిరిపోయే తీపికబురు ఇదే!

AP Government: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఇప్పటికే పేదలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా నిలబెట్టడం కోసం జగన్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే మదర్స్ డే సందర్భంగా రాష్ట్రంలో తల్లులు కాబోయే మహిళలందరికీ జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికే ఎంతో పోషకాహారమైనటువంటి ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లలో ఇస్తున్నటువంటి బియ్యం, కందిపప్పు, పాలు, గుడ్లు, నూనె, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం వంటి సరుకులను నేరుగా గర్భిణీ బాలింతల ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వనున్నారు. ఇదే కాకుండా గర్భిణి స్త్రీలకు మరొక శుభవార్తను కూడా తెలిపింది.

గర్భిణీల కోసం ఉచితంగా అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.వైద్యులు 18 నుంచి 22 వారాల వ్యవధిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఈ స్కానింగ్ చేయించుకోమని సలహాలు ఇస్తున్నారు. ఈ స్కానింగ్ ద్వారా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఎదుగుదలకు అలాగే తనలో ఏదైనా లోపాలు ఉన్నాయా అని గుర్తించడానికి అవసరమవుతుంది. అయితే ఈ స్కానింగ్ చేయించుకోవాలంటే దాదాపు 1200 నుంచి 1500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

 

ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ఈ స్కానింగ్ ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆస్పత్రిలలో ఉచితంగా చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇది మాత్రమే కాకుండా అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ కి రూ. 250 చొప్పున ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన గర్భిణీలకు ఒక టిఫా స్కానింగ్, రెండు అల్ట్రా సోనోగ్రామ్ స్కానింగ్ లు ఉచితంగా చేస్తారనీ ఏపీ సర్కార్ గర్భిణీ మహిళలకు శుభవార్తను తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -