Sreeleela: ఇదేంటి శ్రీ లీల అలా చేసింది.. బాలయ్యకు బిగ్ షాక్?

Sreeleela: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరోయిన్
శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదట పెళ్లి సందడి సినిమాలో నటించగా ఇటీవలే ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటించిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో శ్రీ లీల తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 

ధమాకా సినిమాతో శ్రీ లీల ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా శ్రీ లీల పేరే జపం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ శ్రీ లీల టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించబోతోంది. కానీ రీసెంట్ షెడ్యూల్ లో శ్రీలీల పాల్గొనాల్సి ఉంది.

అయితే శ్రీలీల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా షూట్ లో పాల్గొనలేని అంటూ హ్యాండ్ ఇచ్చిందట. బాలయ్య లాంటి సీనియర్ హీరోనే కాల్ షీట్స్ సెట్ చేసుకొని షూటింగ్ కోసం అడ్జస్ట్ అయి వస్తే శ్రీ లీల షూటింగ్ కి రాను అని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం అభిమానులు శ్రీ లీల పై మండిపడుతున్నారు. రెండు సినిమాలు హిట్ అయ్యే సరికి ఇప్పుడే కొమ్ములు వచ్చాయా బాలయ్య బాబు లాంటి పెద్ద హీరోలకే నో చెప్తావా అంటూ చాలామంది తిట్టిపోతున్నారు. దీంతో శ్రీ లీలను కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పొట్టి పిల్లకు అంత పొగరా? బాలయ్య అనే హోల్డ్ లో పెడుతుందా అంటూ మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -