YCP MLA: ఈ వైసీపీ ఎమ్మెల్యేకు గడ్డుకాలం.. 2024 ఎన్నికల్లో భారీ షాక్ తగలడం ఖాయమేనా?

YCP MLA: డాక్టర్ మోపురగుండు తిప్పే స్వామి ఇప్పుడు వైసీపీ పార్టీ సభ్యుడు కానీ గతంలో అతను బీజేపీ పార్టీ సభ్యుడు. ఇతను 1999 లో మడకశిర, పలమనేరు నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను 2009వ సంవత్సరంలో బీజేపీ నుంచి చిత్తూరు లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. ఆ తర్వాత వైసీపీలో చేరి మడకశిర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అప్పుడు కూడా ఓడిపోయాడు.

అయితే ఆయనపై గెలిచిన టీడీపీ నాయకుడు ఈరన్న అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారనే నెపంతో అప్పుడు కోర్టు అతనిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. దాంతో 2018 నుంచి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. 2019లో మడకశిర నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి మాత్రం ఆయనకి గడ్డ కాలం నడుస్తుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సొంత పార్టీ వాళ్లే ఆయనకు వ్యతిరేకంగా మారారని, ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నాడంటూ ఏకంగా వైసీపీ అధిష్టానానికి ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయటం గమనార్హం.

 

ఇప్పటికే ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి కూడా ఫిర్యాదు చేశారు సొంత పార్టీ నాయకులు. 2019లో విజయం సాధించినప్పటి నుంచి ఆయన తన సొంత పార్టీ సభ్యులను కూడా ఖాతర చేయటం లేదని, ఆయన మాటతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది అంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిని సొంత పార్టీ వాళ్లు సైతం సహించలేకపోతున్నారు. జడ్పిటిసి మాజీ సభ్యుడు శివకుమార్.

 

మాజీమంత్రి నరసయ్య గౌడ్ తదితర నేతలు ఈ విషయం గాని తిప్పేస్వామి పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదే కారణం చేత మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్ రెడ్డి మరొక నేత రవి శేఖర్ రెడ్డి కూడా ఆయనకి వ్యతిరేకంగా మారారు. వచ్చే ఎన్నికలలో తిప్పేస్వామికి టికెట్ ఇవ్వద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వినతిపత్రం సైతం సమర్పించారు. ఇదే విషయాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్గా తీసుకుంటే కనుక 2024లో తిప్పేస్వామికి భారీ షాక్ తగలటం ఖాయమే అంటున్నారు రాజకీయ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -