Balakrishna: బాలయ్య సినిమా అంటే ఆ ప్రాంతంలో రికార్డులు బద్దలు కావాల్సిందే?

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. ఈయన గత నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణకు కొన్ని ప్రాంతాలలో మంచి పట్టు ఉందని చెప్పాలి. ఇలా కొన్ని ప్రాంతాలలో బాలకృష్ణ సినిమాలకు కంచుకోటగా నిలిచిపోయింది. ఈ ప్రాంతాలలో బాలయ్య సినిమాలు కనక విడుదలయితే సరికొత్త రికార్డులు సృష్టించాల్సిందే.

ఇప్పటివరకు బాలకృష్ణ సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. ఎన్నో సినిమాలు వందరోజుల వేడుకలను జరుపుకున్న దాఖలాలు ఉన్నాయి.ఇక బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా ఏకంగా 105 సెంటర్లలో వందరోజుల వేడుకలను జరుపుకుంది. ఇలా వందరోజుల వేడుకను 100 సెంటర్లలో జరుపుకున్న తొలి హీరోగా బాలకృష్ణ రికార్డ్ సృష్టించారు.

ఈ విధంగా బాలకృష్ణ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇలా శతదినం వేడుకలను జరుపుకున్నాయి.ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బాలకృష్ణకు కంచుకోటగా ఉన్నాయని చెప్పాలి. ఈ ప్రాంతాలలో బాలయ్య సినిమాలో విడుదలయితే వంద రోజుల వేడుక జరగాల్సిందే. ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, నంద్యాల, హిందూపురం,ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలలో బాలయ్యకు ఎంతో మంచి క్రేజ్ ఉంది అలాగే గుంటూరు చిలకలూరిపేట ప్రాంతంలో కూడా ఈయన సినిమాలకు భారీ క్రేజ్ లభిస్తుంది.

బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ఎమ్మిగనూరులో ఏకంగా 400 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. ఇలా బాలకృష్ణ సినిమాలు ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక తాజాగా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా కూడా ఇదే స్థాయిలో రికార్డులను సృష్టించింది. అఖండ సినిమా భారీ విజయం కావడంతో అదే అంచనాలతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -