TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం కీలక పరిణామం.. ఆ నలుగురికి బెదిరింపు కాల్స్

TRS: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనం రేపుతూనే ఉంది. ఈ అంశానికి సంబంధించి రోజు ఏదోక కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తోన్నాయి. ఈ మేరకు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తోన్నట్లు ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని బయపెట్టిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావుతో పాటు మరో ఎమ్మెల్యేకు కూడా కొంతమంది ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కాల్స్ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు.

 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టినందుకు మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆ నలుగురి ఎమ్మెల్యేలకు భద్రతను తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 4+4 భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 24 గంటలు 4+4 గన్ మెన్లతో ప్రభుత్వం భద్రత ఇస్తోంది. అలాగే బుల్లెట్ ఫ్రూఫ్ వెహికల్స్ కూడా కేటాయించారు.

 

ఇప్పటికే ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో సిట్ విచారణకు ఆదేశించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కాల్ రికార్డ్స్ ను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించారు. కాల్స్ రికార్స్ లోని నిందితుల వాయిస్ ను టెస్ట్ చేయనున్నారు. అది వారి వాయిస్ నా.. కాదా అనేది తేల్చనున్నారు. ఈ టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -