YS Sharmila: ఆ ఆఫర్ కు షర్మిల ఒప్పుకుంటారా.. రాజన్న బిడ్డ స్థాయి ఇదేనా?

YS Sharmila: ఈ మధ్యకాలంలో ఏపీ తెలంగాణలో షర్మిల పేరు మారుమోగిపోతోంది. ఆమె రాజకీయాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం కోసం డీకే శివకుమార్ తో పదేపదే భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే షర్మిల రాజకీయాలు చేస్తే ఏపీలో చేసుకోవాలని తెలంగాణలో కాదు అంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాలలో తెలిపారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికి అని, అలాంటిది షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా అని రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన షర్మిల, ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే తాను స్వాగతిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే, సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెను కలుస్తానని స్పష్టం చేశారు. తాను ఇక్కడ ఉన్నని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

పార్టీ విలీనం తర్వాత టీపీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు ఇస్తారని, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల ఇమేజ్‌ కాంగ్రెస్‌‌కు కలిసివస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. డీకే శివకుమార్ ద్వారా వైఎస్ షర్మిల ఈ ప్రయత్నాల చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆమెక కావాలంటే ఏపీలో పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు కానీ తెలంగాణలో ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరని రేవంత్ నేరుగానే చెబుతున్నారు. మరి పార్టీ విలీనం విషయంలో షర్మిల వెనక్కి తగ్గుతుందా.. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రాజకీయాలను ఏపీలోనే చూసుకుంటుందా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -