Modi-KCR: మోదీ విమర్శల గురించి కేసీఆర్ స్పందించకపోవడానికి కారణమిదా?

Modi-KCR: మొన్న వరంగల్ లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వీరి అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను పడిందని హెచ్చరించారు. అయితే ఈ విమర్శలకి హరీష్ రావు దగ్గర నుంచి జగదీష్ రెడ్డి వరకు అందరూ ప్రతిస్పందించారు మళ్ళీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య యుద్ధం ప్రారంభమైందా అన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నించారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదు.

అదే ఇప్పుడు తీవ్ర చర్చలకి దారితీస్తుంది. గతంలో బీజేపీ పై యుద్ధం ప్రకటించినప్పుడు కేసీఆర్ రోజు ప్రెస్ మీట్ లు పెట్టి కడిగి పారేస్తానని ప్రకటించేవారు. ఇప్పుడు సందర్భం వచ్చిన కూడా స్పందించకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర పార్టీ నేతలు ఎంత ఘాటుగా స్పందించినా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండటంపై బీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రెండు పార్టీల మధ్యన మళ్లీ పోరాటం ప్రారంభమైందని బీజేపీని కూడా కేసీఆర్ ప్రత్యర్థిగా భావిస్తున్నారని అనుకునేలాగా చేయడం కోసం బీజేపీ చాలా ప్రయత్నిస్తుంది.

 

ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ ప్రధాని మోదీ హెచ్చరించినట్లుగా దర్యాప్తు సంస్థలు విరుచుకుపడితేనే ఆ ఎఫెక్ట్ వస్తుందనేది రాజకీయ వర్గాల వారి అంచనా. అయితే ఈ విధంగా చేయటం బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో సానుభూతిని తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు అందుకే ఆలోచిస్తున్నారన్న అభిప్రాయము వినిపిస్తుంది. హై కమాండ్ ఢిల్లీ రాజకీయాలలో ఇబ్బందికర పరిస్థితులలో ఉంది ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం ద్వారా మరిన్ని సమస్యలను తెచ్చుకుంది.

 

ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో రేసులోకి రావాలంటే పరిస్థితులు కూడా కలిసి రావాలి దీనికోసమే ఎదురుచూస్తుంది బీజేపీ. ఇంత జరుగుతున్నా కేసీఆర్ బీజేపీ ని విమర్శించడం తగ్గించారు. దీంతో బీజేపీ ఇబ్బందుల్లో పడుతుంది 2 పార్టీల మధ్య అవగాహన ఉందేమోనన్నా ఒక అనుమానాన్ని ప్రజల్లోకి పంపిస్తుంది. ఫలితంగా బీజేపీకి ఇబ్బంది ఎదురవుతుంది. ఈ పరిస్థితి బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత బలపడుతుంది. కేసీఆర్ సైలెన్స్ వెనుక ఇంత రాజకీయ చతురత ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు రాజకీయ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -