Tollywood Anchors: తెలుగు యాంకర్లు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

Tollywood Anchors: తెలుగులో హీరోయిన్స్ తో సమానంగా యాంకర్లు డబ్బులు సంపాదిస్తున్నారు. హీరోయిన్స్ కు సినిమాల పరంగా రెమ్యూనరేషన్ వస్తుంది. ఒక్కో సినిమా పూర్తవ్వడానికి సంవత్సరం పడుతుంది. కానీ యాంకర్లకు అలా కాదు.. టీవీ షోలు, ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఈవెంట్స్ రోజూ ఉంటాయి. దీంతో హీరోయిన్స్ తో పోలిస్తే యాంకర్లకు ఎక్కువగా సంపాదిస్తున్నారు. యాంకరింగ్ తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బోల్డెంత సంపాదిస్తున్నారు తెలుగు యాంకర్లు.

తెలుగు యాంకర్లలో నెంబర్ వన్ ఎవరు అనగానే సుమ అని ఎవరైనా చెబుతారు. తెలుగు చానళ్లలో రోజూ ఏదోక షో చేయడంతో పాటు ప్రీ రిలీజ్ పంక్షన్లతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఒక్కో ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ కు రూ.2 నుంచి రూ.2.5 లక్షల వరకు తీసుకుంటుందట. ఇక అవార్డ్ ఫంక్షన్ అయితే మరో రేటు ఉంటుందట.

ఇక సుమ తర్వాత యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. తన అందాల ఆరబోతతో కుర్రాళ్లను ఆకర్షిస్తూ యాంకర్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఒక్కో ఈవెంట్ కు రూ.2 లక్షల వరకు చార్జ్ చేస్తుందట. ఇక అనసూయ తర్వాత అంతటి పాపులర్ అయిన యాంకర్ రష్మీ గౌతమ్. ఒక్కో ఈవెంట్ కు రూ. లక్షన్నరపైనే ఛార్జ్ చేస్తుందట.

ఇక శ్రీముఖి కూడా ఒక్కో ఈవెంట్ కు రూ.లక్ష రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో నటించిన యాంకర్ మంజూష ఒక్కో ఈవెంట్ కు రూ.50 వేలు తీసుకుంటుందట. ఇక యాంకర్ శ్యామల ఒక్కో ఈవెంట్ కు రూ.40 వేల నుంచి రూ.50 వేలు, యాంకర్ ప్రశాంతి రూ.15 వేలు, పల్లవి రామిశెట్టి రూ.15 వేలు తీసుకుంటుంద.

ఇక సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన వంటలక్క ఫేమ్ ప్రేమీ విశ్వనాథ్.. ఒక్కో ఎపిసోడ్ కు రూ.50 వేలు రెమ్యూనరేషణ్ తీసుకుంటుంద. కార్తీకదీపం సినిమాతో పాపులర్ అయిన వంటలక్క ఇప్పుడు షోలతో బిజీగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -