Tollywood: ఎప్పటికీ నిలిచిపోయే రికార్డ్స్ సొంతం చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా?

Tollywood: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో రికార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఆ రికార్డ్స్ ఎంతో కాలం ఉండవు. ఎందుకంటే కొత్త సినిమాలు రావడం వల్ల కొన్ని సినిమాలు బ్రేక్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు వాటి తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటి రికార్డ్ స్థానం అస్సలు ఎక్స్పైర్ అవ్వదు. ఇప్పుడు మనం ఆ కోవకు చెందిన సినిమాల గురించి తెలుసుకుందాం.

సీనియర్ ఎన్టీఆర్: దానవీరశూరకర్ణ మూవీ 1977, 1986, 1994లో మూడుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడుసార్లు కూడా కోటి రూపాయలు వసూలు చేసింది. అప్పటి ప్రేక్షకులను ఈ సినిమా మరో స్థాయిలో అబ్బురపరిచింది. లవకుశ ఒక విడతలోనే విడుదలైనప్పటికీ వంద రోజులు సినిమాగా శాశ్వత రికార్డును సృష్టించింది.

ఏఎన్ఆర్ : ఏఎన్ఆర్ గారికి భారతీయ దేశంలో ఎవరికీ లేని రికార్డు తన సొంతం. అప్పట్లో ఎనిమిది కేంద్రాల్లో 300 రోజులు ఆడిన సినిమా ప్రేమాభిషేకం. ఇది ఒక వండర్ ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత బాలరాజు, కీలు గుర్రం అనే సినిమాలు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి మరో స్థాయిలో ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. అలా వరుసగా 8 ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్ లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్ లు ఉన్న హీరోగా అక్కినేని నాగేశ్వరరావు నిలిచిపోయారు.

సూపర్ స్టార్ కృష్ణ: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ వరుసగా 324 సినిమాల్లో హీరోగా నటించిన ప్రపంచ స్థాయి రికార్డ్. అదేవిధంగా ఒకే సంవత్సరం 18 సినిమాల్లో హీరోగా నటించిన సినీ హీరో కూడా తనే. అలాగే ఒకే నెలలో తన రెండు సినిమాల విడుదలైన సంఘటనలు 60 సార్లు ఉన్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ పలు ఇండస్ట్రీ హిట్ లను కూడా సంపాదించుకున్నాడు. ఇక కృష్ణ గారి చరిత్రలో కూడా కొన్ని సినిమాలు శాశ్వతంగా ఇండస్ట్రీ హిట్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -