Towel in Stomach: గర్భిణీకి ఆపరేషన్ చేసిన డాక్టర్.. కానీ చివరికి మాత్రం అలా?

Towel in Stomach: ఈమధ్య కాలంలో వైద్యులు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అది పేషంట్ల ప్రాణానికి ప్రమాదంగా మారుతోంది. వారు చేసే చిన్న చిన్న పొరపాట్లకు పేషెంట్ల ప్రాణాలు పోతున్నాయి. కాగా ఆపరేషన్ చేస్తూ వైద్యులు ఇంజక్షన్ అలాగే కత్తెర ఇతర వస్తువులు కడుపు లోపల మరిచిపోయారు అంటూ ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నప్పటికీ కొందరు వైద్యులు పేషంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక వైద్యుడు గర్భిణీ స్త్రీకి ఆపరేషన్ చేసి కడుపు లోపల టవల్ మర్చిపోయిన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోహ్రానా ప్రాంతంలో నివసిస్తున్న నజ్రానా అనే మహిళకు నెలలు నిండి నొప్పులు రావడంతో పాటు ఆమె నొప్పులకు భరించలేకపోవడంతో వెంటనే నజ్రానాను భర్త సైఫీ నర్సింగ్ హోమ్ లో చేర్పించాడు. అక్కడ వైద్యుడు మత్లూబ్ ఆపరేషన్ చేసి ఆమెకు ప్రసవం చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ వైద్యుడు వ్యవహరించిన తీరే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నజ్రానాకి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో ఒక టవల్ ని ఉంచి కుట్లు వేశారు. డెలివరీ తర్వాత ఆమెకు తీవ్రంగా చలి కడుపు నొప్పి రావడంతో బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల అలా జరుగుతుందని అనుకున్నారు.

 

ఆ తర్వాత భార్యకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో వెంటనే భర్త ఆమెను మరొక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అసలు విషయం బయటపడింది. ఆమెకు స్కానింగ్ చేయగా ఆమె కడుపులో టవల్ ఉన్నట్లు గుర్తించారు. మరొక సర్జరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో ఉన్న టవల్ ను బయటికి తీశారు. అయితే గర్భిణీ స్త్రీ టవల్ వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా కలకలం అయిపోయింది. ఈ ఘటన పై స్పందించిన వైద్యాధికారి రాజీవ్ సింఘాల్, దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -