Ginna Movie Trolls: ఓయో రూములెందుకు దండగ.. జిన్నా థియేటర్ ఉండగా?

Ginna Movie Trolls: దీపావళి కానుకగా జిన్నా సినిమా విడుదలైన విషయం తెలిసిందే. సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా.. పాయల్ రాజ్‌పుత్, సన్నిలీయోన్ హీరోయిన్లుగా నటించారు. అయితే సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా మీమర్స్, ట్రోరల్స్ ఆ సినిమాపై కామెంట్లు చేస్తుంటారు. సినిమా బాగున్నా.. బాగా లేకున్నా.. కమెడియన్ల రియాక్షన్లతో సినిమాలను ట్రోల్ చేసి పడేస్తారు. ప్రస్తుతం జిన్నా సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ ను చూస్తే మీరు షాకవుతారు. మంచు ఫ్యామిలీపై మీమ్స్, ట్రోల్స్ కొత్తేమి కాదు. అయితే ఈ సారి మంచి విష్ణు నటించిన జిన్నా సినిమాను మరింత దారుణంగా ట్రోల్ చేసినట్లు అనిపిస్తోంది.

ఓ వైపు సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చిత్ర బృందం పాజిటివ్ ప్రచారం చేపడుతోంది. మరో వైపు ఈ సినిమాను చూసేవాడే లేడని మీమ్స్ సర్క్యూలేట్ చేస్తున్నారు. సినిమా థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయని చెబుతూ మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే సినిమా థియేటర్లు అన్ని ఖాళీగా ఉండటంతో మీమర్స్ డిఫరెంట్‌గా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓయో రూమ్స్ బుక్ చేసుకోవడం మానేసి.. కొన్ని జంటలు జిన్నా థియేటర్లు బాట పట్టాలని తెలుపుతూ మీమ్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై మంచు విష్ణు మండిపడుతున్నారు. కావాలనే కొందరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిన్నా విడుదల సమయంలోనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని, అందుకే మూవీ కలెక్షన్లు రాబట్టలేకపోయిందని మంచు విష్ణు తెలిపారు. దీంతో ప్రస్తుతం జిన్నా మూవీ కలెక్షన్స్ వివరాలు హాట్ టాపిక్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో బోల్తా కొట్టింది. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిందని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జిన్నా ఫస్ట్ డే కలెక్షన్ కేవలం రూ.12 లక్షలు మాత్రమేనని, ఓవర్‌సీస్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సినీ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -