Vahbbiz Dorabjee: విడాకుల తర్వాత మళ్లీ ప్రేమ.. అవసరమా అంటూ ట్రోల్స్?

Vahbbiz Dorabjee: ప్రముఖ బుల్లితెర నటి వాబిజ్‌ దొరబ్జీ నటుడు వివియన్‌ డిసెనా ప్యార్‌ కీ ఎ ఏక్‌ కహానీ సీరియల్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ సమయంలోనే లవ్ లో పడిన ఈ జంట 2013లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకొని విడిపోవడంతో ప్రస్తుతం ఈమె సింగిల్ గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి 37 ఏళ్ల వయసులో ప్రేమలో పడింది వాబిజ్‌ దొరబ్జీ. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రెండవ ప్రేమ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రశ్నించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గతంలో ఏదో జరిగినంత మాత్రాన మళ్లీ ప్రేమను పొందే అర్హత నాకు లేదా? నేను కచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటాను. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడే దాని గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు.సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు మీకే తెలుస్తాయి. లైఫ్‌లో నేను రెండో ఛాన్స్‌ తీసుకోవాలనుకున్నాను. అందుకు నాకు పూర్తి అర్హత ఉంది. విడాకుల సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను. ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకున్నాను. పగిలిన మనసు ముక్కలను తిరిగి అతికించాను. కుటుంబసభ్యులు, స్నేహితుల సహాయం తీసుకున్నాను. నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నాను.

 

సినిమాలలో అవకాశాల గురించి మాట్లాడుతూ.. నా వయసున్న హీరోకు తల్లిగానా? నో ఛాన్స్‌ సొంతంగా డబ్బు సంపాదిస్తున్నాను. స్వతంత్ర మహిళగా అది నాకు చాలా విశ్వాసాన్ని ఇచ్చింది. నాకు వస్తున్న కొన్నిరకాల పాత్రలపై నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. హీరో తల్లిగా చేయమని అడుగుతున్నారు. నా వయసు ఉన్న వ్యక్తికి నేను తల్లిగా ఎలా చేయగలను? ఇలాంటి ఆఫర్స్‌ చూస్తే నవ్వొస్తుంది, కానీ ఇది నిజంగా అన్యాయం. ఇండస్ట్రీలో ఇంకా అసమానతలు ఉన్నాయి. అనుపమ సీరియల్‌లో నటి రూపాలీ గంగూలీదే మెయిన్‌ రోల్‌. అలాంటి మహిళా ప్రాధాన్య పాత్రలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది అని తెలిపింది వాబిజ్‌ దొరబ్జీ.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -