Naresh-Pavitra: నరేష్ పవిత్రల వ్యవహారం చెడిందా.. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమన్న నరేష్?

Naresh-Pavitra: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఏదైనా హాట్ ట్రెండింగ్ టాపిక్ ఉందా అంటే అది కేవలం పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం అని మాత్రమే చెప్పాలి. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.రహస్యంగా వీరి రిలేషన్ కొనసాగిస్తున్న సమయంలో ఈ వ్యవహారంలోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇవ్వడంతో వీరి బాగోతం మొత్తం బయటపడింది.

ఇలా రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరొక మహిళతో ఎలాంటి రిలేషన్ పెట్టుకుంటారు అంటూ పెద్ద ఎత్తున గొడవకు దిగింది. ఇక ఈ ముగ్గురి మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు తలెత్తాయి.ఇకపోతే నరేష్ పవిత్ర లోకేష్ బెంగళూరులో ఒక హోటల్ రూమ్ లో అడ్డంగా రమ్యకు బుక్ కావడంతో ఆమె వారిపై చెప్పుతో దాడి చేయడానికి కూడా వెనకాడ లేదు. ఇలా నరేష్ పవిత్రలు తమ రిలేషన్ ను బహిరంగంగా బయటపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం పవిత్ర లోకేష్ నరేష్ మధ్య వ్యవహారం చేడిందని వీరిద్దరూ వీరి రిలేషన్ బ్రేకప్ చెప్పకున్నారట వార్తలు వస్తున్నాయి.అయితే వీరిద్దరూ కూడా ఓ అగ్రిమెంట్ ప్రకారం రిలేషన్ లో ఉన్న విషయం గురించి గతంలో వార్తలు వచ్చాయి. నెలకు నరేష్ 25 లక్షలు చొప్పున పవిత్రకు ఇచ్చేలాగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అయితే నరేష్ ఎప్పుడైనా తనని వదిలించుకోవాలని చూస్తే తనకు 50 కోట్ల రూపాయల భరణంగా ఇవ్వాలని ఈ అగ్రిమెంట్ లో కుదుర్చుకున్నారు.

ఇకపోతే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని నరేష్ పవిత్రను దూరం పెట్టి ఇండస్ట్రీలో ఫెయిడ్ అవుట్ అయిన మరొక హీరోయిన్ తో చనువుగా ఉండడం చేత పవిత్ర లోకేష్ అగ్రిమెంట్ ప్రకారం తనకు 50 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తనకు 50 కోట్ల రూపాయల చెల్లించకపోతే తన బండారం మొత్తం బయట పెడతానని పవిత్ర హెచ్చరించగా నరేష్ మాత్రం తనకి 50 లక్షల రూపాయలు ఇస్తాను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పారట. మరి వీరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -