TRS: టీఆర్ఎస్ పేరు మార్పుపై సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు

TRS: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి కేంద్రంలో చక్రం తిప్పాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని చూస్తున్నారు. అందుకోసం తెలంగాణ రాష్ట్ర సమతి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్ల అందరూ కలిసి పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడంపై తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ ప్రతినిధులు బృందం అందజేసింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎ్ గా మార్చే విషయాన్ని ఈసీ పరిశీలిస్తోంది.

ఇప్పటికే భారత అనే పేరు మీద చాలా పార్టీలు ఉన్నట్లు ఈసీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ పేరు విషయంపై ఈసీ పరిశీలన చేపడుతోంది. అయితే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై సీఎం కేసీఆర్ ఓ సర్వే చేయించినట్లు తెలస్తోంది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరు మార్పును చాలామంది ఇష్టపడలేదని సర్వేలే తేలిందని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అనే పేరును పార్టీ పేరు నుంచి తీసేయడాన్ని చాలామంది తప్పుబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ అనే పేరును పార్టీ పేరు నుంచి తీసేయడంపై పైర్ అయినట్లు సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.

పార్టీ పేరుతో తెలంగాణ అని లేకపోతే కేసీఆర్ కు రాష్ట్రంలో విలుత తగ్గుతుందని కొంతంమది అబిప్రాయపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ పార్టీనే లేదని, ఇప్పుడు తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరులో తొలగించడం ద్వారా పార్టీకి ఆదరణ తగ్గునుందని సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ ఎక్కడుందని సర్వేలో కొంతమంది ప్రశ్నించినట్లు గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ వల్ల టీఆర్ఎస్ కు భారీగా నష్టం జరుగుతుందని, దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై ఉంటుందని అంచనాలు వస్తున్నాయి.

ఈ సర్వేలో మెజార్టీ మంది టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని వ్యతిరేకించారు. పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలను షాక్ కు గురి చేస్తోంది. ప్రజల నుంచి ఆమోదం వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. కానీ ప్రజల నుంచి ప్రతికూల రియాక్షన్ రావడం టీార్ఎస్ వర్గాలకు గుబులు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ వల్ల వచ్చే ఎన్నికల్లో ఎటువంటి నష్టం జరుగుతుందోమని టెన్షన్ పడుతన్నారు. ఒక్కసారిగా టీఆర్ఎస్ ను పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల ప్రజలు అయోమయంలో పడే అవకాశముందని టీఆర్ెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.

కానీ కొన్ని రోజుల పాటు మాత్రమే ప్రజల్లో కన్ ప్యూజన్ ఉంటుందని, కొద్దిరోజుల తర్వాత అనుకూలంగా మారుతారని గులాబీ నేతలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పార్టీ పేరు మార్చిన మొదట్లో వ్యతిరేకత ఉంటుందని, కొద్దికాలం తర్వాత ఓపీనియర్ మారే అవకాశముందని కొంతమంది నేతలు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా పేరు మార్పుపై ఈ సర్వేలో వచ్చిన విషయాలను చూసి టీఆర్ఎస్ నేతలు ఖంగుతిన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -