Uday Kiran: శోకసంద్రంలో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్.. లేఖలో అలా ఉండటంతో?

Uday Kiran: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకొని చిన్న వయసులో ఆత్మహత్య చేసుకొని మరణించిన యంగ్ హీరో ఉదయ్ కిరణ్. టాలీవుడ్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయడంతో పాటు యంగ్ జనరేషన్ కి బాగా దగ్గరైన హీరో ఉదయ్ కిరణ్. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ఉదయ్ కిరణ్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు.

అప్పట్లో యూత్ లో ఉదయ్ కిరణ్ కు తిరుగులేని ఫాలోయింగ్, క్రేజ్ ఉండేవి. టాప్ హీరోల సినిమాలను ఆదరించిన స్థాయిలో ఉదయ్ కిరణ్ సినిమాలను కూడా జనాలు ఆదరించే వాళ్లు. అయితే మెగా కుటుంబం ఉదయ్ కిరణ్ ని తమ కుటుంబ సభ్యుడిగా మార్చుకోవాలని అనుకున్నదని, ఆ తర్వాత కాదనుకుందనే గుసగుసలు వినిపించాయి.

అయితే కొన్నాళ్లకు ఉదయ్ కిరణ్ కు విషితా అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది.. వారిద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి కూడా జరిగింది. కాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్ కు అవకాశాలు తగ్గడం, ఫ్యామిలీ ఇష్యూల వల్ల అతడు చాలా డిప్రెషన్ కి గురైనట్లు వార్తలు వచ్చాయి. చివరగా.. అతడు ఓ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంతకీ ఉదయ్ కిరణ్ రాసిన లెటర్ లో ఏముందంటే?:

‘విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు.అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‌గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’
– ఉదయ్ కిరణ్

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -