Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Rishab Shetty: కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. కాంతరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇలా ఈ సినిమా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతి ఒక్క భాషలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో ప్రతి ఒకరు ఆయన గురించి సర్చ్ చేసి ఆయన వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటున్నారు.మరి రిషబ్ శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

రిషబ్ శెట్టి 1983 జులై 7వ తేదీన కర్ణాటకలోని కుందాపూర్ గ్రామంలో భాస్కర్ లక్ష్మీశెట్టి దంపతులకు జన్మించారు. ఈయనకు ఒక సోదరుడు కూడా ఉన్నారు.

సినిమాలపై మక్కువతో రిషబ్ శెట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డిప్లమా కోర్స్ పూర్తి చేశారు. ఇలా డిప్లమా కోర్స్ పూర్తి చేసిన ఈయన ప్రముఖ డైరెక్టర్ ఏ ఎంఆర్ రమేష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

2010వ సంవత్సరంలో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడిగా మారారు. మొదటగా రిషబ్ శెట్టి ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో క్రెడిట్ లేని రోల్ ప్లే చేశారు. ఇలా పలు చిన్నచితగా సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయనకు దర్శకుడిగా రక్షిత్ శెట్టి అవకాశం కల్పించారు.

రక్షిత్ శెట్టి రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘కిరిక్ పార్టీ సినిమాతో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఒకవైపు దర్శకుడిగా చేస్తూనే మరోవైపు హీరోగా కూడా నటించారు.

రిషబ్ శెట్టి దర్శకుడిగా మూడో సినిమా ‘సర్కారీ హిరియా ప్రాథమిక షాలే కాసరగోడు’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాకు ఏకంగా ఫిలింఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్, ఐఫా అవార్డులు కూడా లభించాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ప్రగతి అనే అమ్మాయితో 2016 వ సంవత్సరంలో పరిచయం ఏర్పడింది.

ఈ విధంగా ప్రగతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి రిషబ్ శెట్టి 2020 సంవత్సరంలో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -