Unstoppable 2: బాలయ్య షోకి గెస్టులు దొరకలేదా… అందుకే ఇలాంటి చిన్న హీరోలను ఆహ్వానిస్తున్నారా?

Unstoppable 2: బాలకృష్ణ అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా ఎంతో టాలెంట్ ఉన్నవారు అని తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా నిరూపించుకున్నారు. ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య తన వాక్చాతుర్యంతో అభిమానులను సందడి చేయడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు.కావడంతో రెండవ సీజన్ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
మొదటి సీజన్ కు సినీ సెలెబ్రిటీలను ఆహ్వానించగా రెండవ సీజన్ కు  రాజకీయ నాయకులను ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లతో ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తోంది.ఇక ఈ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సీజన్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి చిన్న హీరోలు అయినటువంటి విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ఎంతోమంది బాలయ్య పరిస్థితి మరి ఇంత ఘోరమా రెండవ సీజన్ ఇలాంటి చిన్న హీరోలతో సరిపెట్టుకోవాల్సిందేనా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ సీజన్ కి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి వాళ్లను కూడా ఆహ్వానించవచ్చు అయితే వీరితో ఈ కార్యక్రమాన్ని చేయటానికి బాలకృష్ణ సుముఖంగా లేరనే వాదన వినపడుతోంది. ఈ కార్యక్రమానికి గెస్ట్ ల లేకపోవడంతోనే సీజన్ 2 కోసం ఇలాంటి మిడిల్ రేంజ్ హీరోలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో రేటింగ్ రాకపోవచ్చు అని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -