Varahi: పంటలు బాగా పండాలంటే వారాహి తల్లిని ఇలా పూజించాలా.. ఏం జరిగిందంటే?

Varahi: భారతదేశంలో హిందువులు ఎంతోమంది దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఒకొక్క రోజున ఒక్కొక్క దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడం కోసం విఘ్నేశ్వరుడిని అలాగే సంతానం కలగడం కోసం సంతానలక్ష్మిని, అష్టైశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవిని ఇలా కారణాలను బట్టి ఆయా దేవుళ్లను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ పూజిస్తూ ఉంటారు. అలా పంటలు బాగా పండాలి అంటే తప్పకుండా ఈ తల్లిని పూజించాల్సిందే అంటున్నారు పండితులు.

మరి పంటలు బాగా పండి, సంతోషంగా ఉండాలి అంటే ఏ దేవతను పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా రైతులు ఏదైనా పంటను వేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు తప్పకుండా దేవుడికి పూజించి ఆ తర్వాత ఆ పంటను మొదలు పెడుతూ ఉంటారు. పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను కోసే ముందు కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి సస్యశ్యామలం కావడానికి భూమాత రూపమైన వారాహి దేవతను పూజించడం అన్నది ఆనవాయితీగా వస్తోంది. వారాహి అనుగ్రహం ఉంటే తప్పక పంటలు విరివిగా పండుతాయని నమ్మకం. వారాహి తల్లిని పూజించడం వల్ల పండించిన పంటలకు తప్పకుండా గిరాకి లభించి మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 

అందుకోసం షాడ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాడ శుద్ధ నవమి వరకు గల తిధుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. రాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాడంలో వచ్చే వారాహి నవరాత్రి కూడా ఒకటి. వారాహి దేవి లలిత పరాభట్టారికా సేనాని,లలిత రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్ని వారాహి ఆధీనంలో ఉంటాయి. అందుకే వారాహి అమ్మవారిని దండనాథ అని కూడా అంటారు. ఈ విషయం లలితా సహస్రనామాలలో కూడా వస్తుంది. చండీ సప్తశతిలో కూడా ఉంది. లలితా పరమేశ్వరి ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహి దేవి. అమ్మవారిని పూజించడం వల్ల పంటలు బాగా పండడంతో పాటు భూ తగాదాలు కూడా పరిష్కారం అవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -