Varun Tej: ఘోస్ట్ డిజాస్టర్ అయినా వరుణ్ తేజ్ మారలేదుగా.. ఏం జరిగిందంటే?

Varun Tej: గరుడవేగ సినిమా ద్వారా తన సత్తా ఏంటో చాటుకున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్. గరుడవేగ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈయన టాలెంట్ చూసినటువంటి స్టార్ హీరోలు సైతం ఇతనకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.

సినిమా మొత్తం గన్నులు మోత ఉండడంతో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కాస్త ఎబెట్టుగా అనిపించింది. ఇందులో గన్నుల మోత తప్ప ఇంకేమీ లేదని ప్రేక్షకులు ఈ సినిమాని పూర్తిగా తిరస్కరించారు.గరుడవేగ సినిమాలో ఉపయోగించిన స్టైల్ ఘోస్ట్ సినిమాలో కూడా ఉపయోగించారు. ఇందులో కొత్తగా ఏమీ లేదని ప్రేక్షకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

ఈ విధంగా ఘోస్ట్ వంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాత దర్శకుడు తన తదుపరి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు .కానీ ప్రవీణ్ సత్తార్ మాత్రం తన రూటు సపరేట్ అన్నట్టు మరోసారి కూడా గన్నులు, యాక్షన్ సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈయన తన తదుపరి చిత్రాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఇలాంటి డిజాస్టర్ సినిమా చూసిన తర్వాత కూడా వరుణ్ ప్రవీణ్ సత్తార్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారా తన నిర్ణయంలో ఏమాత్రం మార్పు చేసుకోలేదా అని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సినిమా ఘోస్ట్ సినిమా కన్నా ముందుగానే కమిట్ కావడంతో చేసేదేమీ లేక ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో కూడా గన్నులను చూపించడంతో ప్రవీణ్ సత్తార్ విషయంలో ఎలాంటి మార్పు లేదని..మరోసారి అలాంటి పాత చింతకాయ పచ్చడి తోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -