Vasundhara: ఆ సినిమా అంటే వసుంధర ఎంతో ఇష్టంగా చూస్తారా.. ఏమైందంటే?

Vasundhara: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా నందమూరి తారక రామారావు వారసుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బాలకృష్ణ వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇలా యంగ్ హీరోలకు పోటీగా ఈయన మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య నటించిన సినిమాలలో తన భార్య వసుంధర దేవికి ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఒకటి ఉందని తెలుస్తుంది. బాలయ్య 1982వ సంవత్సరంలో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ దంపతులకు ముగ్గురు సంతానం బాలయ్య సినిమా పనుల నిమిత్తం బిజీగా ఉండగా వసుంధర దేవి ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను భుజాలపై వేసుకొని వారిని ఎంతో ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఇలా బాలయ్య భార్యగా ఈమె తన విజయానికి కూడా కారణమైందని చెప్పాలి. ఇక బాలయ్య సినిమాలలో ఈమెకు ఏ సినిమా అంటే ఇష్టం అనే విషయానికి వస్తే..

 

బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమా ఎప్పటికీ తన ఫేవరెట్ మూవీ అంటూ వసుంధర పలు సందర్భాలలో వెల్లడించారు.చాలా ట్రెడిషనల్ గా హోంలీగా కనిపించే వసుంధర చూడటానికి కూడా చాలా సాఫ్ట్ గానే ఉంటారు కానీ ఈమెకు మాస్ యాక్షన్ సినిమాలంటేనే ఇష్టమని అందుకే తన భర్త నటించిన సమరసింహారెడ్డి సినిమా అంటే తనకు ఎప్పటికీ ఇష్టమేనని ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YCP Candidates: వైసీపీ అభ్యర్థులు అంతా పేదవాళ్లేనా.. అయ్యో ఇంత పేదవాళ్లకు టికెట్లు ఇచ్చారా?

YCP Candidates: పాపం.. వైసీపీ నేతలు అందరు పేదవాళ్లే.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇదే మేము అంటున్న మాట కాదండోయ్ వైసీపీ నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న...
- Advertisement -
- Advertisement -