Waltair Veerayya: వీరయ్య లోకల్.. వాల్తేరు వీరయ్యకు హైలెట్ డైలాగ్ ఇదే!

Waltair Veerayya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆయన పక్కన నటించాలని నటీనటులు, కుర్ర హీరోలు కూడా కోరుకుంటూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ తో మాస్ మహారాజ రవితేజ వాల్తీరు వీరయ్య సినిమాలో కలిసి నటించారు. ఇరవై ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్యనే రిలీజ్ అయిన పూనకాలు లిరికల్ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, పాటకు రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా మెగాస్టార్ తో కలిసి రవితేజ వేసిన డ్యాన్స్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఈ హీరోలిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడాన్ని మాత్రం ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కూడా పలు ఇంటర్వ్యూలలో దీని గురించి ప్రత్యేకంగా చెబుతూ అందర్నీ ఊరిస్తూ ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురుచూస్తున్నారు. సినిమా పాటే ఇలా ఉంటే పరస్పరం తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయోననే అందరూ ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా హైప్ కి తగినట్లే ఓ కీలకమైన లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు చిరు, రవితేజలు ఒకరినొకరు పోలీస్ స్టేషన్ లో తలపడే సీన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ ఏసిపిగా నటిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ తనతో సవాల్ చేసే సీన్ అద్భుతంగా ఉంటుందని సమాాచారం.

తనతో సవాల్ విసురుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ‘సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు’ అనే సీన్ చూస్తే అందరికీ పూనకాలు రావడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇడియట్ లో ఎంత పెద్ద సూపర్ హిట్ సంభాషణో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదని, దానికి కౌంటర్ గా రవితేజ సైతం ఘరానా మొగుడులో ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెబుతాడని, మొత్తానికి ఈ సన్నివేశం అందర్నీ అలరిస్తుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -