Veerasimha Reddy: వీరసింహారెడ్డి కథ, డైలాగ్స్ లీక్.. గూస్ బంప్స్ రావాల్సిందే!

Veerasimha Reddy: ‘అఖండ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో నందమూరి నటసింహం బాలయ్య ఫుల్ జోష్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలతోపాటు అన్‌స్టాపబుల్ సీజన్-2 కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ‘వీరసింహారెడ్డి’ సినిమా బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

ఇప్పటికే సినిమాకు సంబంధించి ‘జై బాలయ్య సాంగ్, సుగుణ సుందరి సాంగ్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ కూడా మంచి ఆదరణ పొందాయి. సినిమా నుంచి రిలీజ్ అయిన సీన్స్ మాములుగా లేవు. భారీ ఎలివేషన్స్ తో డైరెక్టర్ మలినేని గోపీచంద్.. బాలయ్యకు సూపర్ హిట్ మూవీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలు, డైలాగులు లీక్ అయ్యాయి.

 

ఈ మూవీ నుంచి లీకైన డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఒక సీన్‌లో బాలయ్య తన ఎడమ కాలు తొడకొట్టి.. ఒక అడుగు ముందుకు వేస్తాడు. విలన్ దునియా విజయ్ పీక మీద కాలు పెట్టి.. ‘పులివెందుల అయినా.. పులిచెర్ల అయినా.. పులిబిడ్డ ఈ వీరసింహారెడ్డి. ఈ వీరసింహారెడ్డి ప్రజల ముందుంటే.. సింహం ముందు ఉన్నట్లే.. ఆ సింహాన్ని ఎదురించి ముందుకు వచ్చే దమ్ముంటే.. నువ్వు నన్ను దాటి వెళ్లరా..’ అనే భారీ డైలాగ్ ఉంటుంది.

 

నార్మల్‌గానే ఈ డైలాగ్ ఓ రేంజ్‌లో ఉంది. అలాంటి బాలయ్య నోట వింటే అదిరిపోతుంది. అలాగే ఈ సినిమా స్టోరీ లైన్ కూడా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో కనిపించే ‘వీరసింహారెడ్డి, రెండోది యూఎస్ రిటర్న్ ‘బాలసింహారెడ్డి’. ఈ రెండూ తండ్రీకొడుకల క్యారెక్టర్స్. గ్రామ రాజకీయాల్లో తండ్రి వీరసింహారెడ్డి చనిపోతే.. బాలసింహారెడ్డి రాజకీయాల్లో రాణిస్తూ.. విలన్లపై రివేంజ్ ఎలా తీసుకుంటాడు. తన తండ్రి కలలను ఎలా సాకారం చేస్తాడు? అనే విధంగా స్టోరీ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -