Venkatesh Prasad: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ ప్రసాద్.. ఏమైందంటూ ఆందోళనలో అభిమానులు?

సాధారణంగా భారతీయులు ఎవరినైనా దేనినైనా అవమానించడం మొదలుపెట్టారు అంటే వారి అభిమానానికి అవధులు ఉండవని చెప్పాలి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రీడలలో ఒకటైన క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే క్రికెటర్స్ ని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. ఇలా భారత జట్టులో 90 లలో బౌలర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వెంకటేష్ ప్రసాద్ గురించి ఇప్పటికీ అభిమానులు మర్చిపోరు.

ఇకపోతే క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెటర్ల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే మాజీ స్టార్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా ఆగస్టు 15వ తేదీన పురస్కరించుకొని ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోలో ఈయన గుర్తుపట్టలేనంతగా ఉండడం చూసి అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విధంగా వెంకటేష్ ప్రసాద్ బక్కపలుచుగా గుర్తుపట్టలేనంతగా ఉండడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటోపై కామెంట్లు చేస్తూ ఒక్కసారిగా సర్ ఏమైంది? ఆరోగ్యం బాగాలేదా? ఎందుకిలా మారిపోయారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈయన సమాధానం చెబుతూ తన ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందని సమాధానం చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్ పర్వతాలలోని గిరివలంలో సాధనలో ఉండటం వల్ల లైట్ ఫుడ్ తిసుకుంటున్నాను. మళ్లీ తిరిగి మీరు మీ పాత వెంకటేష్ ప్రసాద్ ను చూస్తారు అంటూ సమాధానం చెప్పడమే కాకుండా మీ ప్రేమకు, అభిమానానికి చాలా థాంక్స్ అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా వెంకటేశ్ ప్రసాద్ బక్క పలుచగా ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -