Vijay Deverakonda: విజయ్ దేవరకొండ జాతకంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. ఆందోళనలో ఫ్యాన్స్!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తెలుగు సినీ నటుడు. ఇతను నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలలో చిన్న పాత్రలతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలిసి నటించాడు. ఇక పెళ్లిచూపులు సినిమా ఇతని కెరీర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

అలా ఇతని జీవితంలో మరో సినిమా గీతాగోవిందం మంచి విజయం సాధించి పెట్టింది. ఇలా కెరీర్లో ముందుకు సాగుతున్న విజయ్ కెరీర్లో లైగర్ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈయన కెరీర్లో రెండు మూడు సినిమాలు విజయం సాధించగా చాలావరకు పరాజయం అయ్యాయి. ఈ క్రమంలో ఈయన జాతకం పై అస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఫ్యాన్స్ లో కొంత ఆందోళన నెలకొంది.

వేణు స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కి అష్టమ నడుస్తుందని, ఆయన జాతకం ప్రకారం అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉందని, ఇది కొంతకాలం కొనసాగుతూ.. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతున్నాయని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

విజయ్ కెరీర్ పరంగా రెండు మూడు సినిమాలు సానుకూలంగా ఉన్న మున్ముందు కష్టంగా కొనసాగే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. జాతకరీత్యా ఇప్పుడున్న స్టార్ హీరోలకు సమాంతరంగా విజయ్ కెరీర్ నడిచేలా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా వేణు స్వామి నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం కావడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విజయ్ కెరీర్ పై ఫ్యాన్స్ లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయ్, సమంత కలిసి ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -