Sreeleela: శ్రీలీల సినీ కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణుస్వామి.. ఏమైందంటే?

Sreeleela: వేణు స్వామి సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ విధంగా వేణు స్వామి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ఆయన చెప్పిన విధంగా జరగడంతో ఎంతోమంది ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమైంది. ఇలా వేణు స్వామి తరచూ సినీ సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే వేణు స్వామి తాజాగా నటి శ్రీ లీల జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె సుమారు 8 సినిమాలకు పైగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోల సినిమాల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాల వరకు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నటువంటి శ్రీ లీల గురించి వేణు స్వామి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. శ్రీ లీల రాశి మీనరాశి అని తెలిపారు.

 

ఈమె జాతకం రీత్యా ఎంతో రాజయోగం ఉందని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఈమెకు రాజయోగం నడుస్తుందని రాజయోగానికి పెద్ద పేరు తీసుకు వచ్చే శక్తి ఆమె జాతకంలో ఉందని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. వేణు స్వామి శ్రీ లీల జాతకం గురించి మాట్లాడుతూ 2028 వరకు ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతుందని తెలిపారు.

 

ఈమె జాతకం రీత్యం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి నయనతారకు పోటీగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని ఈమెకు పేరు పెరిగే కొద్దీ ఆర్థిక అభివృద్ధి కూడా కలిసి వస్తుందని,పేరుతో పాటు డబ్బు కూడా దానంతట అదే పెరుగుతుందని ఈ సందర్భంగా శ్రీ లీల జాతకం గురించి వేణు స్వామి కామెంట్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -