Venkatesh: ఆ స్టార్ హీరోయిన్ కు చీర కట్టిన విక్టరీ వెంకటేశ్.. ఈ హీరో మామూలోడు కాదంటూ?

Venkatesh: తెలుగు ప్రేక్షకులకు హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా వెంకటేష్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు. వెంకటేష్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే మగవారి కంటే ఎక్కువగా ఆడవారే సినిమా థియేటర్ లకు క్యూ కడుతూ ఉంటారు.

అందులోనూ ముఖ్యంగా ఫ్యామిలీలో ఎక్కువగా సినిమా థియేటర్లకు వస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. హిట్ అయితే స్టార్ హీరోలతో సరిసమానంగా వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన 74 సినిమాలు చేస్తే అందులో అధికశాతం సూపర్ హిట్ సినిమాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో పై ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలా వెంకటేష్ పై కూడా అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కాగా వెంకటేష్ సినిమాల ద్వారా ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. అటువంటి వారిలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు.. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 

మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంవత్సరంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈమె వెంకటేష్ కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించింది, ఆ మూడు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిల్లో వసంతం మూవీ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రంలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ చీర కట్టే సన్నివేశం ఒకటి ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆర్తి అగర్వాల్ కి స్వయంగా ఆయనే చీర కట్టేవాడట, ఎందుకంటే ఆర్తి అగర్వాల్ కి చీర కట్టుకోవడం రాదు కాబట్టి. ఈ విషయం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -