Vijay Devarakonda – NTR : ఎన్టీఆర్ చరణ్ కిల్లర్ పర్ఫామెన్స్ ఇచ్చారు!

Vijay Devarakonda – NTR: నటుడు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం విశేషం.ముఖ్యంగా ఇందులో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో ఉండడంతో తప్పకుండా ఈయనకు అవార్డు దక్కుతుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయం పై విజయ్ దేవరకొండకు ప్రశ్న ఎదురుగా ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ.. తారక్ అన్నకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఆయనకు కనుక అవార్డు వస్తే అభిమానులకు మెంటలే అంటూ తనదైన స్టైల్ లో కామెంట్ చేశారు. సినిమా చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పురస్కరించే ఈ అవార్డులలో మన దేశం నుంచి ఇలాంటి అవార్డును అందుకోవడం అంటే ఎంతో గర్వకారణం అని తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఇద్దరు కిల్లింగ్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిపుల్ ఆర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఎన్నో అంచనాల నడుమ విజయ్ దేవరకొండ తన లైగర్ ద్వారా ఈనెల 25వ తేదీ రాబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -