Liger: లైగర్ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Liger: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 25వ తేదీ విడుదల కాగా ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోవడంతో విజయ అభిమానులు ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇలాంటి నెగటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్ దేవరకొండ కెరియర్ ప్రస్తుతం ఇబ్బందులలో పడబోతుందని పలువురు భావిస్తున్నారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం థియేటర్లో విడుదలైన ప్రతి ఒక్క సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ ధరలకు కొనుగోలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే లైగర్ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన ఓ వార్తా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా అన్ని భాషలలో డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 85 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఈ క్రమంలోని ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలో డిజిటల్ మీడియాలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -