Vijay Deverakonda: లైగర్ కోసం విజయ్ దేవరకొండకు భారీగా రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ గురించి ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. లైగర్ కు మిక్స్ డ్ టాక్ వస్తుండగా.. కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. సినిమా పూరీ, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్థాయికు తగ్గట్లు లేదని, పాన్ ఇండియా లెవల్ లో సినిమా లేదని కొంతమంది ప్రేక్షకులు అంటున్నారు. పూరీ స్థాయికి తగ్గట్లు పవర్ ఫుల్ డైలాగ్స్ లేవని, కథాబలం కూడా లేదని చెబుతున్నారు. కథలో పూరీ విఫలం అయ్యరని, విజయ్ పర్‌పామెన్స్ కూడా ఆకట్టుకునేలా లేదని అంటున్నారు.

రిలీజ్ కు ముందు లైగర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా రానుండటం, మైక్ టైసన్, రమ్యకృష్ణ లాంటి నటులు నటిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మైక్ టైసన్ పాత్రను కూడా సరిగ్గా తీయలేదని, అతడి పాత్రలో బలం లేదంటున్నారు. కానీ ఈ సినిమాకు మాత్రం భారీ బడ్జెట్ అయింది. పూరీ, జగన్నాథ్, చార్మీతో పాటు కరణ్ జోహర్ కూడా నిర్మాతగా వ్యహహరించారు. ఆర్టిస్టులకు కూడా భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో నటించిన ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

విజయ్ కు తల్లిగా నటించిన రమ్యకృష్ణకు రూ.కోటి, హీరోయిన్ అనన్య పాండేకు రూ.2 కోట్లు, విష్ణురెడ్డికి రూ.80 లక్షలు, మకరంద్ దేష్ పాండేకు రూ.40 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోది.ఇక విజయ్ దేవరకొండ రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక మైక్ టైసన్ కు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందులో రమ్యకృష్ణ నాగమణి పాత్రలో నటించగా.. ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక మైక్ టైసన్, విజయ్ మధ్య ఉండే కొన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా సినిమా ప్లాప్ అయిందని చెప్పవచ్చు. సినిమాను వేరే లెవల్ లోకి తీసుకెళ్లేందుకు పాటలు బాగా ఉపయోగపడతాయి. ఈ సినిమాలోని పాటలు ఎవరినీ అంతగా ఆకట్టుకోలేదు. ఒక్క పాట కూడా ట్రెండింగ్ అవ్వలేదు. మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -