Vijay Antony: మహేష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్.. బిచ్చగాడంటూ?

Vijay Antony: తెలుగు సినిమా ప్రేక్షకులకు నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ఆంటోనీ పేరు వినగానే ముందుకు గుర్తుకు వచ్చే సినిమా బిచ్చగాడు. ఈ సినిమా అప్పట్లోనే విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తర్వాత విజయ్ అంటోనీ తర్వాత మళ్లీ ఏ సినిమాలలో కనిపించలేదు. ఇకపోతే విజయ్ ప్రస్తుతం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

కాగా విజయ్‌ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్‌ తెలుగులో బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్‌ 2 బిచ్చగాడు 2 సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారు.కాగా ఈ సినిమా ఈ నెల 19 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న విజయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒక‌వేళ ఇందులో ఈ పాత్ర‌ని విజ‌య్ ఆంటోనీ కాకుండా మ‌రో హీరో చేస్తే? ఆ పాత్ర‌లో ఎవ‌రు బాగుంటారు? అన్న విష‌యంపై విజ‌య్ ఆంటోనీ స్పందించాడు.

 

మ‌హేష్ బాబు అయితే ఆ పాత్ర‌కు నూరు శాతం న్యాయం చేస్తార‌ని, మ‌హేష్ లుక్‌, ఎక్స్‌ప్రెష‌న్స్ ఈ పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోతాయ‌ని విజ‌య్ ఆంటోనీ వ్యాఖ్యానించాడు. బిచ్చ‌గాడు 2 ట్రైల‌ర్లో విజ‌య్ చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు. టైటిల్ బిచ్చ‌గాడే అయినా అందులో విజ‌య్ మ‌ల్టీమిలీయ‌నీర్ పాత్ర పోషించాడు. కాబ‌ట్టి మ‌హేష్ పేరు చెప్ప‌డం స‌బ‌బుగానే అనిపిస్తోంది. కాగా విజ‌య్‌కి మహేష్ అంటే చాలా ఇష్ట‌ం. త‌న‌తోఒక సినిమా డైరెక్ట్ చేయాల‌న్న కోరిక‌ను కూడా విజ‌య్ ఆంటోనీ ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -