Vijay Sai Reddy: 175 నుంచి లెక్క తగ్గించిన విజయసాయిరెడ్డి.. 2024లో గెలుపుపై నమ్మకం లేదా?

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి బాపట్ల జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పరిశీలకులు, నాయకులతో సమావేశం అయ్యారు. అలాగే బుధవారం బాపట్ల కోనభవన్లో విడివిడిగా నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఉదయం రాష్ట్ర మంత్రి మేరగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాచిన కృష్ణ చైతన్య, కరణం వెంకటేష్, బలరాం లతో విజయసాయిరెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. వాళ్లతో జిల్లాలో పార్టీ పరిస్థితి నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరుని సమీక్షించారు.

అలాగే పార్టీ అనుబంధ విభాగాలు కమిటీ నియామకాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాల పైన ఆయన ఆరా తీశారు. అనంతరం జిల్లాలోని నియోజకవర్గాల పరిశీలకు సమావేశం నిర్వహించారు. దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన తర్వాత మొదటిసారిగా విజయసాయిరెడ్డి బాపట్ల జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో 87% కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా కలిగించాము కాబట్టి 51 శాతం పైగా ప్రజలు మన వైపే ఉన్నారు. ఈసారి కచ్చితంగా 151 సీట్లు గెలుచుకుంటాము అని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఓట్ల కోసమేనని మరొకసారి ధ్రువీకరించినట్లయింది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈసారి 175 సీట్లు వైసీపీకే వస్తాయని జగన్ చెప్పుకుంటుంటే విజయసాయిరెడ్డి 150 ఒక సీట్లు మాత్రమే వస్తాయని చెప్పటం గమనార్హం.

 

అప్పుడే ఆయన 24 సీట్ల కోత పెట్టేయడం గమనిస్తే వైసీపీ నేతల ప్రగల్బాలు వాస్తవాలకు చాలా దూరం ఉందని అర్థమవుతుంది. బహుశా ఎన్నికల దగ్గర పడే సమయానికి ఈ సంఖ్య ఇంకా తగ్గుతుందేమో. 175 నుంచి లెక్క తగ్గించి 151కి వచ్చేసావేం విజయ్ సాయి రెడ్డి.. వచ్చే ఎన్నికలలో గెలుపు పై నమ్మకం లేదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ వర్గీయులు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -