Assembly Polls: విజయసాయిరెడ్డికి వెన్నులో వణికిస్తున్న లోకేశ్ వ్యూహం..భలే ప్లాన్ చేశారుగా!

Assembly Polls: ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టు తయారైంది టీడీపీ యువనేత లోకేష్ స్వభావం. తండ్రిచాటు కొడుకు, తెలుగు రాదు.. ఏం మాట్లాడుతారో అర్థం కాదు అనుకునే వాళ్లకు నారాలోకేష్ తనదైన షాకులు ఇస్తున్నారు. వై నాట్ 175 అంటున్న నేతలకు లోకేష్ వ్యూహాలు దడపుట్టిస్తున్నాయి. వైసీపీ స్పెషల్ ఫోకస్ ఎక్కువగా లోకేష్ పైనే ఉంటుంది. చంద్రబాబు తర్వాత లోకేష్ కనుక.. ఆయన ఓ ఫెయిల్యూల్ లీడర్ అని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విషయంలో కొంతవరకూ సక్సెస్ అయ్యారు కూడా. అయితే.. తర్వాత పరిస్థితి మారింది. లోకేష్ అంటే ప్లవర్ కాదు.. ఫైర్ అని గత కొంతకాలంగా అనిపించుకుంటున్నారు. అందుకే.. వైసీపీకి మంగళగిరిలో ఏం చేయాలో తోచడం లేదు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఎవరిని పోటీగా దించాలో అర్థంకావడం లేదు.

గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ తరుఫున పోటీ చేసిన ఆళ్లరామకృష్ణ ఆయనపై గెలిచారు. అయితే, ఓడిపోయానని డీలా పడకుండా లోకేష్ మంగళగిరిలో తన పట్టుపెంచుకుంటూ వచ్చారు. సొంత నిధులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో.. ఆయనను ఓడించడం అంత సులభంకాదని వైసీపీ భావించింది. మంగళగిరిలో బీసీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వారిని ఓట్లను కొల్లగొట్టాలంటే.. బీసీ నేతను బరిలో దించాలని భావించింది. దీంతో.. గతంలో పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణకు హ్యాండ్ ఇవ్వడానికి సిద్దమైంది. ఆ విషయాన్ని ముందే గ్రహించిన ఆర్కే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

మంగళగిరిలో గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసి, ఆ స్థానాన్ని గెలిపించే బాధ్యత విజయసాయిరెడ్డి తీసుకున్నారు. దీంతో.. గంజి చిరంజీవిని పోటీకి దించాలని మొదట భావించారు. ఆయన 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి 20 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్థానికంగా చిరంజీవి కొంత పట్టుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ పై గెలవడానికి గంజి చిరంజీవి బలం సరిపోదని వైసీపీ అనుకుంటుందని టాక్ వినిపిస్తుంది. దీంతో.. చిరంజీవితో పాటు టికెట్ ఆశిస్తున్న మరో బీసీ నేత కాండ్రు కమల పేరు కూడా వినిపిస్తుంది. బీసీతో పాటు మహిళ కార్డు కూడా తోడవ్వడంతో కొంతమేర నెట్టుకురావచ్చి భావించింది వైసీపీ అధిష్టానం.

కానీ, ఆమెను కూడా పూర్తిగా విశ్వసించలేకపోతున్నారట. అంతకు మించి ఎవరైనా కావాలని సతమతం అవుతన్నారు. గంజి లేదా కాండ్రు కమలను ఫైనల్ చేస్తారా? మరో కొత్తవ్యక్తిని తెరపైకి తీసుకొవస్తారో తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి ఫుల్ ఫోకస్ మంగళగిరిపైనే ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ, స్థానికంగా మాత్రం ఎవరు పోటీ చేసినా.. ఈసారి లోకేష్‌ను ఓడించడం అంత సులభం కాదని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పప్పు అనిపించుకున్న లోకేష్ ఏకంగా వైసీపీతో తల పండిన నేతలకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -