Cobra First Review: కోబ్రా సినిమాకు రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు.. సినిమా ఎలా ఉందంటే?

Cobra First Review: కోలీవుడ్ నటుడు విక్రమ్ శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 31వ తేదీ విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో విక్రమ్ 10 విభిన్న పాత్రలలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సెన్సార్ సభ్యుడు ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

ఇక ఉమైర్ సందు ఈ సినిమా గురించి మాట్లాడుతూ…ప్రేక్షకులు విక్రమ్ సినిమా నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటారో అలాంటి ప్రతి ఒక్క అంశం ఈ సినిమాలో ఉందని ఈయన వెల్లడించారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, మిగతా సన్నివేశాలు చాలా హైలెట్ అవుతాయని పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక విజువల్ వండర్ లా ఉంటుందని వెల్లడించారు. ప్రొడక్షన్ డిజైన్ క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఈయన తన రివ్యూ ద్వారా వెల్లడించారు.

ఇక ఈ సినిమా యూనిక్ కాన్సెప్ట్ తో ఎంతో టేరిపిక్ గా ఉందని ఈయన వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా ఎంతో హైలెట్ అవుతుందని తెలిపారు. ఇక ఈయన ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చారు.ఇక మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు ఈ సినిమా పెద్ద పండుగలా ఉంటుందని ఈ సందర్భంగా ఈయన తన రివ్యూ ఇచ్చారు. ఇక ఈయన రివ్యూ చూస్తుంటే అభిమానులలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే విక్రమ్ సినిమా విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. మూడు సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరో సినిమా చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమైర్ సందు ఈ సినిమాకి ఈ విధమైనటువంటి రివ్యూ ఇవ్వడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -