Virat Kohli: అక్కడ ఆడటమంటే కోహ్లీకి పూనకాలే.. బట్లర్ గ్యాంగ్‌కు బడిత పూజే..!

Virat Kohli: పొట్టి ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌తో రెచ్చిపోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ఆడటమంటే చాలా ఇష్టం. కోహ్లీ ఇక్కడ 64 ఇన్నింగ్స్ లలోనే సుమారు 3,500 పరుగులు చేశాడంటేనే ఆస్ట్రేలియాలో ఆడటం విరాట్‌కు ఎంత ఇష్టమో అర్థమవుతున్నది. ఇక ఆస్ట్రేలియాలోని మిగతా గ్రౌండ్‌ల సంగతి పక్కనబెడితే అడిలైడ్ లో ఆడటమంటే కోహ్లీకి పూనకాలు వస్తాయి. ఇక్కడ కోహ్లీ మొత్తంగా 10 మ్యాచ్‌లలో 14 ఇన్నింగ్స్ ఆడి 907 పరుగులు చేశాడు.

 

 

అడిలైడ్ ‌లో కోహ్లీ నాలుగు టెస్టులు ఆడాడు. ఇందులో 8 ఇన్నింగ్స్ లో 509 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. వన్డేలలో నాలుగు మ్యాచ్ లు ఆడి 244 రన్స్ చేశాడు. ఇందులోనూ రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల విషయానికొస్తే.. 2 టీ20 ఇన్నింగ్స్ లలో రెండు అర్థ సెంచరీలతో 154 రన్స్ చేశాడు. ఇక్కడ కోహ్లీ సగటు 68.09 (అన్ని ఫార్మాట్లలో కలిపి) గా ఉంది. ఇదే వేదికపై కోహ్లీ టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక్కడ ఆడిన రెండు టీ20లలో కూడా కోహ్లీ నాటౌట్ గానే ఉన్నాడు.

 

 

ఈ రికార్డుల గురించి ఇప్పుడు చెప్పుకోవడానికి కారణముంది. ఇండియా – ఇంగ్లాండ్ మధ్య రేపు (గురువారం) జరుగబోయే సెమీఫైనల్ వేదిక అడిలైడ్ లోనే కావడం గమనార్హం. ఒకవేళ కోహ్లీ గనక అడిలైడ్ లో గత మ్యాచ్‌ల మాదిరిగానే చెలరేగితే మాత్రం ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు.

ఈ టోర్నీలో కోహ్లీ అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 5 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు వచ్చి 246 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ.. టోర్నీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతడి తర్వాత సూర్యకుమార్ యాదవ్.. 5 ఇన్నింగ్స్ లలో 225 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరినీ టార్గెట్ గానే ఇంగ్లాండ్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నది. ఈ ఇద్దరూ రెచ్చిపోకుండా ఉండేందుకు గాను ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ తమ బౌలర్లతో ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ప్రణాళికలు రూపొందించాడని టాక్ నడుస్తున్నది. మరి గత మ్యాచ్‌ల మాదిరిగానే వీర్ -శూర్ (కోహ్లీ – సూర్య) జోడీ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా అదరగొడుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -