Virat Kohli: అలాంటి ఎనర్జీని గతంలో ఎప్పుడూ నేను పొందలేదు: కోహ్లీ

Virat Kohli: టీమిండియాలో ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇలా ఎంత మంది ఉన్నా రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ అనే పేరు మాత్రం ఒకే ఒక్క క్రికెటర్ కు దక్కుతుంది.. అతడే విరాట్ కోహ్లీ. గ్రౌండ్ లో ఎప్పుడూ ఎనర్జీతో యాంగ్రీ మోడ్ లో కనిపించే విరాట్ కోహ్లీ అంటే కొన్ని కోట్ల మందికి ప్రాణం. అతడి లాగా రికార్డులను బ్రేక్ చేయడం వేరే ఏ క్రికెటర్ కి సాధ్యం కాలేదు.

 

రవిశాస్త్రి, గవాస్కర్ తో సహా ఎంతో మంది క్రికెటర్లు విరాట్ కోహ్లీని ఓ అద్భుతం అనే అంటారు. అలాంటి విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో ఎలా విజృంభించాడో అందరికీ తెలుసు. టీమిండియా గెలుపు అసాధ్యం అనుకున్న తరుణంలో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ తో ఆ ఆశలకు ప్రాణం పోశాడు.

 

అభిమానుల ఊహలకు తగ్గట్టుగా మ్యాచ్ లో అద్భుతం చేసి చివరకు టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే రెక్కించి చూసే క్రికెట్ అభిమానులకు కోహ్లీ ఫుల్ మీల్స్ పెట్టాడు. అక్టోబర్ 23న జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ గురించి విరాట్ కోహ్లీ తాజాగా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

 

‘అక్టోబర్‌ 23, 2022 నా హృదయంలో ప్రత్యేకంగా ఉంటుంది. క్రికెట్‌లో అలాంటి ఎనర్జీని గతంలో ఎప్పుడూ నేను పొందలేదు. ఆ సాయంత్రం ఎంతో బ్లెస్సింగ్‌తో కూడినది’ అని విరాట్ కోహ్లీ పోస్టులో వివరించాడు. కాగా టీ20 వరల్డ్ కప్ 2020లో టీమిండియా పాక్ మీద గెలిచినా ఇంగ్లండ్ చేతిలో మాత్రం ఓటమిపాలైంది. దాంతో టీమిండియా ఇంటి బాట పట్టడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -