Vishnu Manchu: వెన్నెల కిషోర్ అహంకారుడు అంటూ కామెంట్ చేసిన మంచు విష్ణు?

Vishnu Manchu: టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఢీ సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఊహించని స్థాయిలో సక్సెస్ ను తన సొంతం చేసుకున్నాడు. అనంతరం పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మంచు విష్ణు నిర్మాతగా కూడా పలు సినిమాలకు ప్రాణం పోసాడు.

దాదాపు కొంతకాలంగా మంచు విష్ణుకి సినిమాల పరంగా ఆహా అనిపించే సక్సెస్ ఇంతవరకు అందలేదు. కాగా మంచి విష్ణు త్వరలో జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ఈశాన్ సూర్య దర్శకత్వం వహించగా అందాల భామ పాయల్ రాజ్ పుత్, బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్ లుగా మెప్పించబోతున్నారు. కాగా ఈ సినిమాకు ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. జిన్నా సినిమా ఒక మంచి సినిమా అవుతుందని తెలిపాడు. అదే విధంగా జిన్నా సినిమా తన కెరియర్లో మైలురాయిగా నిలుస్తుందని విష్ణు బల్లగుద్ది మరి చెబుతున్నాడు. మొత్తానికి మంచు విష్ణు జిన్నా సినిమాతో భారీ స్థాయిలో నమ్మకాలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి మాట్లాడుతూ వెన్నెల కిషోర్ నాకు ఒక మంచి మిత్రుడు అని తెలిపాడు.

అహంకారం ముందు పుట్టి ఆయన తర్వాత పుట్టాడని తెలిపాడు. అతడు మర్యాద ఇచ్చినట్టు మాట్లాడుతాడు కానీ నాపై చాలా కోపంగా మాట్లాడుతాడు అని తెలిపాడు. కానీ అతడిని నేను ఏమీ అనలేను. వెన్నెల కిషోర్ అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని తెలిపాడు. ఇక జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విష్ణు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -