Vishnu Priya: ఆంటీ అంటే మండిపోయే అనసూయ మంటకు మరింత ఆజ్యం పోసిన విష్ణు ప్రియ!

Vishnu Priya: టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం అనసూయ సొంతం. తన చక్కటి అందంతో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల మతులు పోగొడుతుంది. ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటుంది.

ఇక గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు సోషల్ మీడియాపై ఒక రేంజ్ లో దాడి చేస్తుంది. తనను నెటిజన్లు ఆంటీ అంటుంటే ఏమాత్రం తీసుకోలేకపోయింది. మరి నెటిజన్లు కూడా ఆమె బాధను అర్థం చేసుకోకుండా ఆంటీ ఆంటీ అంటూ కంటిన్యూ అయిపోతున్నారు. ఇక ఈ బాధను తట్టుకోలేక అనసూయ ఆంటీ అని పిలిచిన వారిపై కేసు పెట్టి పెద్ద షాక్ ఇచ్చింది. మీరు నన్ను ఆంటీ అని పిలవడానికి మీరు ఎవరు? దీని విషయంలో నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని వెల్లడించింది.

దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు అనుసూయను ఆంటీ అని హ్యాష్ టాగ్ లు క్రియేట్ చేసి ఇలా అనసూయ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా యాంకర్ విష్ణు ప్రియ కూడా అనసూయ ఆంటీ అని కామెంట్ చేసి వెంటనే నాలుక కొరుక్కుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియకు ఒక ప్రశ్న ఎదురైనది. ఇండస్ట్రీలో ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అని ఆ యాంకర్ ఒక ప్రశ్న అడగటంతో.. దాంతో విష్ణు ప్రియ టక్కున అనసూయ అని సమాధానం ఇచ్చింది.

ఇక వెంటనే విష్ణు ప్రియ తప్పైపోయిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఈ వీడియోని చూసిన అనసూయ విష్ణు ప్రియ పై ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక మరి కొంతమంది నెటిజన్లు బాగా చెప్పావు అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -