J. D. Chakravarthy: ప్రేమ, పెళ్లి విషయంలో జేడీ చక్రవర్తి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగిందంటే?

J. D. Chakravarthy: తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ భీమినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై ఉన్న యాంకర్ స్లో యాంకర్ విష్ణుప్రియ కూడా ఒకరు. పోవే పోరా షోలో సుధీర్ తో కలిసి హోస్ట్ గా చేస్తూ, భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక హీరోయిన్ రేంజ్ లో అభిమానులని సంపాదించుకుంది. అయితే బుల్లితెరపై హోస్ట్ గా కనిపించే సమయంలో చాలా పద్ధతిగా ఉండే విష్ణుప్రియ సోషల్ మీడియాలో మాత్రం పొట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.

ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్త్స్ సెన్స్ సీజన్ 5 ప్రతివారం సెలబ్రిటీలను తీసుకువచ్చి ప్రేక్షకులను కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ షో కి హోస్టుగా ఓంకార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కి హాజరయ్యారు యాంకర్ రవి, విష్ణు ప్రియ. ఈ నేపథ్యంలోనే ఓంకార్ వారిద్దరితో కలిసి ఎన్నో రకాల ఆటలు, టాస్కులు ఆడించారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ బైక్ కూడా గెలుచుకుంది. ఇక ఎగ్స్ పగలగొట్టేటప్పుడు ఒక విషయం ప్రశ్నిస్తూ.. ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా అని ఓంకార్ అడగగా రీసెంట్ గా ప్రేమలో పడ్డాను. ఆయన వయసు నాకు సరిపోకపోవచ్చు అని మీరు అనుకుంటారు.

ఆయనే జేడి. చక్రవర్తి. ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళిపోతాను అంది తెలిపింది విష్ణుప్రియ. ఎందుకు నీకు ఆయనంటే ఇష్టం అని యాంకర్ ఓంకార్ అడగ ఒక వెబ్ సిరీస్ కోసం 40 డేస్ మంగళూరులో ఆయనతో జర్నీ చేసాను. ఆ జర్నీలో పదో రోజు నేను ఫుల్ ఫ్లాట్ ఐపోయాను అని తెలిపింది.. ఏ విషయంలో ప్రేమలో పడిపోయావ్ అని ఓంకార్ అడిగగా చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి అలా వాల్కనోలా పేలి 2022 నవంబర్ 25 వ తేదీ రాత్రి నాకు అర్ధమయ్యింది. నేను జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానే అనే విషయం తెలిసింది అని చెప్పింది. ఆ ప్రేమ ఏమన్నా పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా అని అడిగేసరికి నేనైతే ఆయనకు చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు అని తెలిపింది విష్ణు.
రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నావా” అని రవి అడిగేసరికి ” ఐ హోప్ సో..నా మనసులో ఏముందో ఆయనకు చెప్పేసాను. ఆల్రెడీ 28 ఏళ్ళు వచ్చేసాయి. తెల్ల జుట్టు కూడా వచ్చేస్తోంది. టైం వేస్ట్ చేయడం ఇష్టంలేక చెప్పేసాను అంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -