Vivekam Movie: వైసీపీకి ఊహించని స్థాయిలో డ్యామేజ్ చేసిన వివేకం మూవీ.. వాస్తవాలు కళ్లకు కట్టినట్టు చూపించారా?

Vivekam Movie: ఏపీలో పొలిటికల్ బేస్డ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే జగన్ కు అనుకూలంగా యాత్ర 2, వ్యూహం, శపథం సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు వైసీపీ మైలేజ్ ను పెంచేందుకు తీశారు. అయితే, ఇక్కడే జగన్‌తో పాటు.. సినిమా యూనిట్ కూడా పప్పులో కాలు వేశారు. ఒకరి జీవిత ఆధారంగా సినిమాలు తీసినపుడు.. ఇప్పుడున్న ప్రజలకు తెలియని వ్యక్తుల గురించి తీస్తే కాస్తా క్యూరియాసిటీ ఉంటుంది. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి లాంటివారి కోసం తీస్తే ఓ అర్థం ఉంది. వాళ్ల గురించి కొంత తెలిసినా.. కానీ, తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే.. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాటికి సోషల్ మీడియా లేదు. కాబట్టి ఆయన గురించి అన్ని విషయాలు అందరికీ తెలియదు. అందుకే రాజశేఖర్ రెడ్డి గురించి తీస్తే ఇప్పటి వాళ్లకి తెలుస్తుంది. కానీ, జగన్ గురించి, జగన్ పాలన గురించి అందరికీ తెలిసిందే. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకూ ఎక్కువగా ప్రజల్లోనే ఉన్నారు. కాబట్టి తెలియాల్సింది. ఏముంటుంది? ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పాలన ఎలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన అమలు చేస్తున్న నవరాత్నాలు, జగన్ టైంలోని రోడ్ల పరిస్థితి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆయన జారీ చేయని ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసిన పోరాటం. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా గురించి మాట మార్చిన విధానం అన్ని చూశాం. ఇంకా సినిమాలో జగన్ గురించి చెప్పేంది ఏం ఉంటుంది? జగన్ తన ప్రసంగాల్లో చెప్పిందే చెబుతూ ఉంటారు. అవి వినడానికే జనానికి విసుగ్గా ఉంటుంది. మళ్లీ అవే ప్రసంగాలను సినిమాల్లో చూపిస్తే థియేటర్ వైపు ఎవరూ చూడరు. వ్యూహం, శపథం, యాత్ర 2లో అదే జరిగింది. థియేటర్లు అన్ని ఖాళీగాను ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీలు టికెట్లు కొని మరీ జనాలను థియేటర్లకు పంపించారు. కాబట్టి సమకాలిన రాజకీయాల్లో ఉన్న వ్యక్తిపై సినిమాలు తీయడంతో ఎలాంటి ప్రయోజనం ఉందడు. అంతేకాదు ఎంతోకొంత మైనస్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

కానీ.. ఒకరి జీవితంలో జరిగిన ఒక సంఘటనపై సినిమా తీస్తే కొంతవరకు జనాలు ఆదరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఆ సంఘటనలో ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ప్రజలకు ఉంటుంది. అలాంటి సంఘటనతో వచ్చిన సినిమా వివేకం. వివేకానందరెడ్డి హత్యకేసు నేపథ్యంలో తీసిన సినమా ఇది. వివేకాహత్య ఎలా జరిగింది అనే దానిపై చాలా మంది క్యూరియాసిటీ ఉంది. మొదట చంద్రబాబే వివేకాను హత్య చేశారని జగన్ ప్రచారం చేశారు. ఆతర్వాత సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి చంపించారని తేలింది. వివేకాతో జగన్ కు ఉన్న గ్యాప్ కారణంగానే ఈ హత్య జరిగిందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనే విషయాన్ని ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఈ సినిమా వలన వైసీపీకి చాలా డ్యామేజ్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై ఈ హత్యను నెట్టి లాభపడ్డారు. కానీ. ఈ సినిమా చూసిన తర్వాత నిజం ఏంటో తెలుస్తుంది. అసలు కడప ఎంపీ విషయంలో ఏం జరిగింది? ఎన్నికల సమయంలో అర్థరాత్రి చంపాల్సిన అవసరం ఏంటీ అని పూసగుచ్చినట్టు సినిమాలో చూపించారు. కాబట్టి వివేకం సినిమా వైసీపీ ఇమేజ్ ను పాతాళానికి తొక్కుతుందని అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -