Chittoor: ముగ్గురు పిల్లల తల్లి 50 ఏళ్ళ వ్యక్తితో అలా?

Chittoor: ప్రస్తుత సమాజంలో చాలామంది వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. భర్తలు భార్యలను కాదని ఇతర మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా, భార్యలు కూడా భర్తలను కాదని పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా బరితెగించి వివాహేతర సంబంధాలకి అడ్డొస్తున్నారని చంపడానికి కూడా వెనకడవడం లేదు. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది చనిపోయిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా శేషాపురం యానాది కాలనీలో కస్తూరి అనే 45 ఏళ్ల మహిళ నివసిస్తోంది. కస్తూరికి గతంలోనే వివాహం కాగా ఒక కూతురు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. కూతురు గతంలోనే మరణించింది. ఇక ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. కస్తూరి భర్త గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించాడు. దాంతో అప్పటి నుంచి కస్తూరి తన భర్త జ్ఞాపకాలతో బతుకుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే కస్తూరికి స్థానికంగా ఉండే రాములు అనే 50 ఏళ్ల వ్యక్తి పరిచయం అయ్యి దగ్గరయ్యాడు.

 

అలా వారి ఇద్దరి మధ్య సంబంధం రాను రాను వివాహేతర సంబంధంగా మారింది. ఇక ఇద్దరికీ మేకలు ఉండడంతో రోజు ఇద్దరూ అడవికి వెళ్లి మేకలను మేపుకొని తిరిగి ఇంటికి వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు శారీరకంగా కలుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రాములుకి కస్తూరిపై అనుమానం పెరిగింది. ఆమె మరొకరితో మాట్లాడుతుందని అనుమానించడం మొదలుపెట్టాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇక ఎప్పటిలాగే ఇద్దరు తాజాగా అడవికి మేకలు తోలుకొని వెళ్లగా అక్కడికి వెళ్ళిన తర్వాత రాములు కస్తూరిని పరాయి మగాళ్లతో సంబంధం ఉంది అని నిలదీశాడు.

 

ఆ విషయంపై ఇద్దరూ పోట్లాడుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన రాములు తన చేతిలో ఉన్న ఆయుధంతో కస్తూరిని దారుణంగా పొడిచి హత్య చేశాడు. రాత్రి అయిన కస్తూరి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని పొలాల్లో వెతకగా ఆ మహిళ ఓ చోట శవమై కనిపించింది. వెంటనే కస్తూరి కొడుకులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాములుని అదుపులోకి తీసుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -