Health Tips: వేసవిలో ఈ చిట్కాలతో ఉపశమనం పొందండిలా?

Health Tips: సాధారణంగా మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక ఎండాకాలంలో అయితే అంతకంటే ఎక్కువగా తాగినా కూడా మంచిదే. మరి ముఖ్యంగా వేసవిలో బయట ఎండకు పనిచేసే వారికి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. అటువంటి వారు నీళ్లు తగిన మోతాదులో లేకుంటే డీహ్రైడ్రేషన్ అయి వివిధ సమస్యలకు దారితీస్తుంది. డీ హైడ్రేషన్ కారణంగా అలసట, వీక్నెస్, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. కాగా వేసవిలో భారీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనిషి శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు తక్షణం మజ్జిగ తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే మజ్జిగ అనేది ప్రో బయోటిక్. ఫలితంగా శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో నీటి కొరత కూడా దూరమౌతుంది. ఈ క్రమంలో డీ హ్రైడ్రేషన్ సమస్య దూరం చేయాలంటే రోజుకు కనీసం 3 సార్లు మజ్జిగ తాగాలి. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పౌడర్ కలుపుకుని తాగితే ఇంకా మంచిది. అలాగే వేసవిలో జొన్న నీరు చాలా ప్రయోజనకరం. జొన్న నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

 

జొన్న నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా జొన్నలు వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత వడకాచి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. రోజుకు 4 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో నీటి కొరత ఏర్పడితే నిమ్మరసం మంచి ప్రత్యామ్నాయం. నిమ్మరసంలో కొద్దిగా పుదీనా, తేనె కలుపుకుంటే ఇంకా మంచిది. రోజుకు కనీసం 3 సార్లు తాగడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ నిమ్మరసం తాగుతుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -