Lakshmi Pranathi-Upasana: వామ్మో.. ఎన్టీఆర్ భార్యను ఇలా చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Lakshmi Pranathi-Upasana: తెలుగు తెర మీద ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించిన స్టార్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీద అదరగొట్టేస్తున్నాడు. ఆ మధ్యన జపాన్ లో అదరగొట్టిన ఈ ఇద్దరు ఈ హీరోలు.. గోల్డెన్ గ్లోబ్ ఆవార్డుల వేదిక మీద కూడా మెరిశారు.

 

తెలుగులో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ తో పాటు తన నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగల మోస్ట్ ట్యాలెంటెడ్ యంగ్ హీరో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘కొమురం భీముడో కొమురం భీముడో’ పాటతో తనలోని నటుడి విశ్వరూపాన్ని ఎన్టీఆర్ ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అదే సినిమాలో ‘నాటు నాటు’ పాటలో అదరిపోయే ఎనర్జీతో ఆహా అనిపించే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన నట విశ్వరూపాన్ని ‘ఆర్ఆర్ఆర్’లో చూపించేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబోకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా వీరిద్దరు చేసిన నాటు నాటు పాటకుగాను ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో పొందారు. అంతర్జాతీయ వేదిక మీద ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబోకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

 

అదే సమయంలో ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీ ప్రణతి మరియు రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదిక మీద వీరిద్దరు కనిపించగా.. వీరిద్దరు కలిసి ఓ సెల్ఫీ తీసుకోవడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: తొలి విడత డబ్బు పంపిణీ దిశగా వైసీపీ అడుగులు.. కోట్లు చేతులు మారుతున్నాయా?

YSRCP: సాధారణంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు మందు, భోజనంతో పాటు రోజువారీ కూలీ కూడా డబ్బులను కూడా అందజేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే కూటమి చేతిలో...
- Advertisement -
- Advertisement -