Almonds: ప్రతిరోజు బాదంపప్పు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే?

Almonds: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి. ఈ బాదంపప్పు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికి తెలిసిందే. బాదంపప్పులో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే బాదంపప్పు నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. పోషకాహార లోపాన్ని నివారించుకోవడానికి ప్రతి ఒక్కరూ రోజూ బాదంపప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

మరి ప్రతిరోజు బాదం పప్పులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు బాదంపప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాదంపప్పు కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. ప్రతిరోజు 20 బాదం గింజలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాదం తినడం వలన కేవలం గుండెకు మాత్రమే కాదండోయ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. బాదం గింజలను సరైన మోతాదులో తీసుకోవడం వలన బూటీరేట్‌ పెరుగుతుంది. బుటీరేట్‌ను పెంచే గుణం బాదం పప్పులకు ఉంది.

 

అందుకే రోజులో 56 గ్రాముల బాదం గింజలు అంటే సుమారు 46 గింజలు తినడం వల్ల బుటీరేట్ పెరుగుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. బాదంలో బి కాంప్లెక్స్ విటమిన్లు బి1, బి3, ఫొలేట్, బి9, మంచి కొవ్వులు, మినరల్స్ కూడా ఉంటాయి. ప్లాంట్ ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం తగినంత బాదం ద్వారా లభిస్తాయి. బాదం తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాదు రక్తంలో షుగర్ కంట్రోల్‌ అవుతుంది. బాదం ప‌ప్పును ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల మ‌నకు అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కోసం పిఠాపురంలో 40 మంది పుష్పలు.. వైసీపీ ఆ రేంజ్ లో ప్లాన్ చేసిందా?

Pawan Kalyan:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల జోరు పెంచారు రాజకీయ నాయకులు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా ప్రచార సభలలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
- Advertisement -
- Advertisement -