Harish Rao: తండ్రి కలను నెరవేర్చిన హరీష్ రావు కొడుకు.. ఏమైందంటే?

Harish Rao: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గురించి మనందరికీ తెలిసిందే. తరచూ రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో పాటు విపక్షాలపై విరుచుకుపడుతూ ఉంటారు. అంతేకాకుండా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటుగా మంచి మంచి పనులు చేసే వారిని అభినందించడం సహాయం కోరిన వారికి సమస్యలకు పరిష్కారం చూపడంలో హరీష్ రావు ముందు ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా తన కుమారుడు చేసిన పనికి సంతోషం వ్యక్తం చేస్తూ తన కుమారుడిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో అవుతోంది. హరీష్ రావు తనయుడు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా హరీష్ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్టాను అందుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని కులరాడు కౌంటీ బౌల్డర్ యూనివర్సిటీ స్నాతకోస్తావం జరిగింది. ఆ వేడుకలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా కొడుకు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ తన కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉంది అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -