Chandrababu-NTR: మామయ్య అంటూ చంద్రబాబును పిలిచిన తారక్.. ఏమైందంటే?

Chandrababu-NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఇటీవల అవార్డుల పంట పండిన విషయం తెలిసిందే. తాజా నాటు నాటు సాంగ్‌కు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. దీంతో సెలబ్రిటీలు, ప్రముఖులంతా చిత్ర యూనిట్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. కంగ్రాట్స్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాటు నాటు, ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాగ్‌లు నెట్టింట్‌ ట్రెండింగ్‌లో నడిచాయి.

 

ఇక నాటు నాటు పాటలో అద్భుతమైన స్టెప్పులతో ఇరగదీసిన హీరోలు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మరోవైపు.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి అవార్డులు రావడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందానికి విషెస్‌ చేశారు. దీంతో ఆయన ట్వీట్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ రిప్లై ఇచ్చారు. ఈ పరిణామం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. చంద్రబాబును ఆప్యాయంగా మామయ్యా అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ పిలుస్తుంటారు.

 

చంద్రబాబు ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ సోమచ్ మామయ్యా.. అని రీట్వీట్‌ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం వైఎస్‌ జగన్ చేసిన అభినందనల ట్వీట్లకు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సీఎం జగన్‌కు థ్యాంక్యూ సార్ అని రిప్లయ్ ఇచ్చారు ఎన్టీఆర్‌. అయితే, నరేంద్ర మోదీ, జగన్‌ మాత్రం శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ట్వీట్‌లో రామ్‌ చరణ్‌ను, జూనియర్ ఎన్టీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.

 

బంధుత్వం కలుపుతూ రిప్లై..
చంద్రబాబు ఎవర్నీ ట్యాగ్‌ చేయలేదు. కీరవాణి, రాజమౌళిని మాత్రమే చంద్రబాబు శుభాకాంక్షల ట్వీట్‌లో ట్యాగ్‌ చేయడం గమనార్హం. అయినప్పటికీ జూనియర్‌ ఎన్టీఆర్‌.. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా బంధుత్వం కలుపుతూ థ్యాంక్స్‌ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అమెరికా నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబుతో సమావేశమవుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డుల ట్వీట్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ రిప్లైతో టీడీపీ నేతల్లో జోష్‌ పెంచినట్లయింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -