Mahesh-Trivikram: మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో? 

Mahesh-Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ని మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివిల్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

మళ్లీ అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాకి ప్రచారం రాని స్థాయిలో ఈ మూవీకి సంబంధించిన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ టైటిల్ సంబంధించి వేర్వేరు వార్తలు వినిపించాయి. అమరావతికి అటు ఇటు, గుంటూరుకారం, ఊరికి మొనగాడు ఇలాంటి టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.

 

గుంటూరు సెంటిమెంట్ తో ఈ సినిమా టైటిల్ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి టైటిల్లో కచ్చితంగా గుంటూరు ఉంటుందని సినీ వర్గాల సమాచారం. గత కొన్ని ఏళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నా మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అయితే ఎందుకో ఈ మూవీ షూటింగ్ నత్తనడక సాగుతుంది.

 

ఈ మధ్యనే విదేశాలకు వెళ్లి వచ్చిన మహేష్ బాబు ఈ నెలలో షూటింగులో పాల్గొనే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఎలాగూ సినిమా విడుదల వాయిదా పడింది కాబట్టి మెల్లగా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుందో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ మేకర్స్. ఈ టైటిల్ కి సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో బోర్డర్ దాటేసి ఉన్న ఆసక్తిని కూడా చంపేసేదిగా తీసుకువెళ్తున్నాయి ఇప్పటికే వాయిదాలు క్యాన్సిల్ స్క్రిప్ట్ పట్ల అసంతృప్తులు లాంటివి బోలెడు జరిగాయి. అలాంటప్పుడు ఏదైనా మంచి ఊపిచ్చే టైటిల్ తో మూవీకి మంచి హైప్ ఇచ్చే టైటిల్ ని తీసుకురావాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట మూవీ మేకర్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -